న్యూఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం సంచలనంగా మారింది. ట్విటర్ కొనుగోలు తరువాత ఖర్చుల తగ్గింపు, పనితీరు అంటూవేలాదిమంది ఉద్యోగులను తీసివేయడంతోపాటు, పలు అనూహ్య నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన మస్క్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం సుమారు 20 బిలియన్ డాలర్ల విలువచేసే స్టాక్స్‌ను ఉద్యోగులను ఇవ్వనున్నట్టు మస్క్ ప్రకటించారు. ట్విటర్ డీల్‌కు వెచ్చించిన దాంట్లో ఇది సగం కంటే కొంచెం తక్కువ. శుక్రవారం ఉద్యోగులకు పంపిన ప్రత్యేక ఇమెయిల్ ప్రకారం, కంపెనీ ఉద్యోగులకు అదనపు ఈక్విటీ గ్రాంట్‌లను అందజేస్తున్నట్లు తన సిబ్బందికి తెలిపింది. ఇప్పుడు ప్రదానం చేసిన షేర్ల విలువ భవిష్యత్తులో పది రెట్లకు పైగా పెరుగుతాయని మస్క్ వెల్లడించారు. అలాగే ఆరు నెలల తర్వాత వీటి ప్రయోజనాలుపొందవచ్చని, దాదాపు ఒక సంవత్సరంలో లిక్విడిటీ ఈవెంట్‌ను అందించాలని కంపెనీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈక్విటీలో కొంత భాగాన్ని క్యాష్ అవుట్ చేయగలరని పేర్కొంది. అయితే, ఈక్విటీ అవార్డులు పొందే ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత లేదు. (మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు: డెడ్‌లైన్ ముగియకముందే మేల్కొండి!)
కాగా ఇటీవల బారీగా ఉద్యోగాల తీసివేత, పలువురు నిపుణుల నిష్క్రమణలు, నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, ట్విటర్ 2021లో స్టాక్ ఆధారిత పరిహారం కోసం సుమారు 630 మిలియన డాలర్లన వెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment