జియో ఉద్యోగులకు గుడ్న్యూస్!
జియో ఉద్యోగులకు గుడ్న్యూస్!
Published Tue, Jan 10 2017 10:38 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
ముంబై : ఉచిత సేవా ఆఫర్లతో వినియోగదారులను సంబురపెట్టిన ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో, సంస్థ కోసం కష్టపడుతున్న ఉద్యోగులకు తీపికబురు అందించాలనుకుటోంది. తన ఉద్యోగుల కోసం స్టాక్ ఆప్షన్స్ను ప్రారంభించాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్ చేస్తోంది. ప్రతిభాపాటవాలు కలిగిన వారికి, చందాదారులను యాడ్ చేస్తున్న ఉద్యోగులకు దశల వారీగా కంపెనీ స్టాక్ ఆప్షన్స్ను బహుమతులుగా ఇవ్వాలని కంపెనీ ప్లాన్ చేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. స్టాక్ ఆప్షన్ ప్రొగ్రామ్ ప్రస్తుతం ప్లానింగ్ స్టేజ్లోఉందని, ఈ ఏడాది చివరిలో దీన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై కంపెనీ మాత్రం స్పందించడం లేదు. గతేడాది సెప్టెంబర్లోనే కంపెనీ 4జీ సర్వీసులను లాంచ్ చేసింది. అప్పటినుంచి వినియోగదారులకు ఉచిత సేవలను జియో కస్టమర్లకు అందిస్తోంది.
ప్రస్తుతం రిలయన్స్ జియోకు 30వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులున్నారు. మొదట సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు స్టాక్ ఆప్షన్లను అందించడం ప్రారంభించిన తర్వాత ఇతర ఉద్యోగులకు అందిస్తుందని ఈ విషయం తెలిసిన మరో అధికారి చెబుతున్నారు. ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్లను ఇవ్వడం టెలికాం సెక్టార్లో సర్వసాధారణం. ఉద్యోగి జీతం బట్టి 10 శాతం నుంచి 200 శాతం రేంజ్లో ఏడాదికి ఒక్కసారి ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్(ఈఎస్ఓపీ)ను దిగ్గజ టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు ఉద్యోగులకు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఈ ప్రొగ్రామ్ ను ప్రారంభించినప్పుడు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు 10-15 శాతం ఈఎస్ఓపీలు పొందుతారని తెలుస్తోంది.
Advertisement
Advertisement