న్యూఢిల్లీ: ఇల్లిక్విడ్ స్టాక్ ఆప్షన్లలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. సెటిల్‌మెంట్ స్కీమ్ 2022 పేరుతో వీటిని పరిష్కరించుకునే అవకాశం సెబీ కల్పించగా, దీన్ని పెద్ద సంఖ్యలో కంపెనీలు వినియోగించుకున్నాయి. 10,980 కంపెనీలు తమపై కేసులను సెబీ వద్ద పరిష్కరించుకున్నాయి.
ఈ పథకం కింద దరఖాస్తుకు 2022 ఆగస్ట్ 22 నుంచి నవంబర్ 21 వరకు మూడు నెలల పాటు అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2023 జనవరి 21 వరకు పొడిగించారు. ‘‘మొత్తం 10,980 కంపెనీలు ఈ పథకం కింద కేసులను పరిష్కరించుకున్నాయి. నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాయి’’అని సెబీ తన ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment