ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా అన్ని రంగాల్లోనూ లేఆఫ్‌లు జరిగాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. భారత్‌లోనూ వేలాది మందిని ఆయా కంపెనీలు తొలగించాయి. అయితే దేశంలో లేఆఫ్స్‌కు సంబంధించి విస్తుగొలిపే లెక్కలు తాజాగా వెల్లడయ్యాయి.
గత రెండేళ్లలో భారతదేశంలో దాదాపు లక్షమంది ఉద్యోగాలు కోల్పోయారని టెక్ ఫోకస్డ్ హైరింగ్ సంస్థ టాప్‌హైర్ (TopHire) నుంచి వచ్చిన డేటా పేర్కొంటోంది. ఈ లెక్కలు బహిరంగంగా నమోదైన గణాంకాల కంటే చాలా ఎక్కువ.గత రెండేళ్లలో భారతదేశం అంతటా 91,000 మంది ఉద్యోగులు తొలగించబడ్డారని టాప్‌హైర్ డేటా హైలైట్ చేసింది.
మూడు రెట్లు అధికం
పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న లేఆఫ్స్ డేటా అగ్రిగేటర్ అయిన లేఆఫ్స్‌డాట్‌ఫై (layoffs.fyi) ప్రకారం, 2021 సెప్టెంబర్ 1 నుంచి భారతదేశంలో దాదాపు 27,850 మంది ఉద్యోగాలు కోల్పోయారు. టెక్‌హైర్ సంస్థ నివేదించిన దానిలో ఇది దాదాపు మూడింట ఒక వంతు మాత్రమే.సైలెంట్ లేఆఫ్‌లు, బలవంతపు రాజీనామాల కారణంగా లెక్కల్లో ఈ భారీ వ్యత్యాసం ఉందని టెక్‌హైర్ నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: యాపిల్, శాంసంగ్ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..
లేఆఫ్స్‌డాట్‌ఫై డేటా ప్రకారం.. భారతదేశంలో గత రెండు సంవత్సరాలలో నమోదైన మొత్తం తొలగింపులలో విద్య లేదా ఎడ్‌టెక్ రంగంలోనే అత్యధికం ఉన్నాయి. బైజూస్, అనకాడమీ, వేదాంతు, అప్‌గ్రేడ్ వంటి కంపెనీలు 10,679 మందిని తొలగించాయి. వీటిలో ఒక్క బైజూస్ సంస్థే దాదాపు ఐదు వేల మందిని తొలగించింది.
ఆ తర్వాత రిటైల్, ఈ-కామర్స్ రంగంలో గత రెండేళ్లలో అత్యధిక లేఆఫ్‌లు నమోదయ్యాయి. మింత్రా, మీషో, మమాఎర్త్, ఫ్లిప్‌కార్ట్, ఉడాన్, దుకాణ్ వంటి సంస్థలు 3,400 మందిని తొలగిచాయి. ఇక ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాలు 3195 ఉద్యోగాల కోతలతో మూడవ స్థానంలో నిలిచాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, డన్జో తదితర సంస్థలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగాలను తగ్గించాయి.
Comments
Please login to add a commentAdd a comment