ప్రముఖ కన్దూమర్ గూడ్స్ కంపెనీ యూనిలివర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 1500 మంది మేనేజ్‌మెంట్ సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చేపట్టిన టేకోవర్ బిడ్ విఫలమైన తర్వాత వాటాదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మాగ్నమ్ ఐస్ క్రీమ్, డోవ్ సబ్బు తయారీదారు ఔషధ కంపెనీలైన గ్లాక్సోస్మిత్ క్లైన్, ఫైజర్ యాజమాన్యంలోని వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ యూనిట్ కోసం £50-బిలియన్ ($68 బిలియన్) విలువ బిడ్ దాఖలు చేసింది. ఇప్పుడు టేకోవర్ బిడ్ విఫలం కావడంతో ఈ ప్రకటన చేసింది
ఈ యూనిలీవర్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,49,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ప్రధానంగా బ్యూటీ, వెల్‌జీయింగ్, పర్సనల్ కేర్, హోం కేర్, న్యూట్రిషన్, ఐస్ క్రీమ్ అనే ఐదు విభిన్న విభాగాలపై దృష్టిసారించాలని యూనిలీవర్ యోచించింది. ఇటీవల టేకోవర్ విఫలమైన తర్వాత పెట్టుబడిదారుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జోప్ ఇలా అన్నారు.. "వృద్ధి మా మొదటి ప్రాధాన్యతగా ఉంది. ఈ మార్పులు ఈ అన్వేషణకు మద్దతు ఇస్తాయి" అని పేర్కొన్నారు. ఈ రంగాలపై ప్రత్యేక ఫోకస్‌ను కేంద్రీకరించడం ద్వారా మెరుగైన డెలివరీ జవాబుదారీతనం పెంపొందేలా చర్యలు చేపడతామని అలన్ జోప్ అన్నారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెప్పడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఆ ప్రభావం యూనిలీవర్ మీద కూడా పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్‌ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది.
(చదవండి: ఆన్‌లైన్‌లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!)
Comments
Please login to add a commentAdd a comment