GlaxoSmithKline
-
ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన యూనిలీవర్ కంపెనీ..!
ప్రముఖ కన్దూమర్ గూడ్స్ కంపెనీ యూనిలివర్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 1500 మంది మేనేజ్మెంట్ సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చేపట్టిన టేకోవర్ బిడ్ విఫలమైన తర్వాత వాటాదారుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మాగ్నమ్ ఐస్ క్రీమ్, డోవ్ సబ్బు తయారీదారు ఔషధ కంపెనీలైన గ్లాక్సోస్మిత్ క్లైన్, ఫైజర్ యాజమాన్యంలోని వినియోగదారుల ఆరోగ్య సంరక్షణ యూనిట్ కోసం £50-బిలియన్ ($68 బిలియన్) విలువ బిడ్ దాఖలు చేసింది. ఇప్పుడు టేకోవర్ బిడ్ విఫలం కావడంతో ఈ ప్రకటన చేసింది ఈ యూనిలీవర్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1,49,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కంపెనీ ప్రధానంగా బ్యూటీ, వెల్జీయింగ్, పర్సనల్ కేర్, హోం కేర్, న్యూట్రిషన్, ఐస్ క్రీమ్ అనే ఐదు విభిన్న విభాగాలపై దృష్టిసారించాలని యూనిలీవర్ యోచించింది. ఇటీవల టేకోవర్ విఫలమైన తర్వాత పెట్టుబడిదారుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలాన్ జోప్ ఇలా అన్నారు.. "వృద్ధి మా మొదటి ప్రాధాన్యతగా ఉంది. ఈ మార్పులు ఈ అన్వేషణకు మద్దతు ఇస్తాయి" అని పేర్కొన్నారు. ఈ రంగాలపై ప్రత్యేక ఫోకస్‌ను కేంద్రీకరించడం ద్వారా మెరుగైన డెలివరీ జవాబుదారీతనం పెంపొందేలా చర్యలు చేపడతామని అలన్ జోప్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతోంది అంటూ ఆర్థిక వేత్తలు చెప్పడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముఖ్యమైన వస్తువుల ధరల పెంచుకుంటూ పోయాయి. దీని ఎఫెక్ట్ మూడు నెలల వ్యవధిలోనే ఎఫ్‌ఎంసీజీలపై పడింది. ఆ ప్రభావం యూనిలీవర్ మీద కూడా పడింది. ఒక్కసారిగా ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆయా వస్తువులను పొదుపుగా ఉపయోగిస్తున్నారు. నీల్సన్ సర్వే తాజా ఇదే విషయాన్ని పట్టి చూపుతోంది. 2021 అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వెల్లడించిన వివరాల్లో ఎఫ్ఎంసీజీల అమ్మకాల వాల్యూమ్స్‌లో 1.8 శాతం క్షీణత నమోదు అయినట్టు వెల్లడించింది. (చదవండి: ఆన్లైన్లో వైరలవుతోన్న అనిల్ అంబానీ కుమారుడి ప్రి వెడ్డింగ్ ఫొటోస్..!) -
మరో రెండు కోవిడ్ ఔషధాలకు డబ్ల్యూహెచ్ ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు ఔషధాలకు ఆమోద ముద్ర వేసింది. రుమటైడ్ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్ కంపెనీ మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీలను కోవిడ్ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్ఓ నిపుణులు అంగీకరించారు. లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్ ఔషధం కరోనా తీవ్రంగా సోకిన వారి ప్రాణాలు కాపాడుతుందని, వారికి వెంటిలేటర్ అవసరం లేకుండా చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే బారిక్టినిబ్‌ను అమెరికా, యూరప్‌లలో గత ఏడాది మే నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఇవ్వొచ్చునని స్పష్టం చేసింది. -
కరోనా టీకా కోసం రూ.15,725 కోట్లు
లండన్: కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధపడుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఈ ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామని జీఎస్కే, సనోఫీ ప్రకటించాయి. దీర్ఘకాలంలో మరో 50 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచుకోవాలని అమెరికా సర్కారు యోచిస్తోంది. బ్రిటన్‌కు చెందిన జీఎస్కే, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 6 కోట్ల కరోనా డోసుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం గత వారం ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ అధికంగా ఉందని, ఒక్క సంస్థ మాత్రమే ఈ డిమాండ్‌ను తీర్చలేదని సనోఫీ కంపెనీ ప్రతినిధి థామస్ ట్రియోంఫ్ చెప్పారు. చాలా కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తిలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. కరోనా సోకిన తొలి శునకం మృతి అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారినపడ్డ మొదటి శునకం ‘బడ్డీ’ శుక్రవారం చనిపోయింది. జర్మన్ షెఫర్డ్ డాగ్ అయిన బడ్డీకి కరోనా సోకినట్లు జూన్‌లో ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. దేశంలో కరోనా బాధిత తొలి శునకం ఇదేనని ప్రకటించారు. అంతకంటే ముందు దాని యజమాని రాబర్ట్ మహనీకి కరోనా సోకింది. ఈ వైరస్ వ్యాప్తికి జంతువులు వాహకాలుగా మారుతాయనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పారు. అయితే, మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. వియత్నాంలో ‘తొలి’ కరోనా మరణం హనోయ్: వియత్నాంలో తొలిసారిగా ఓ వృద్ధుడు(70) కరోనాతో మరణించాడు. అతడికి కరోనా సోకడంతోపాటు కిడ్నీవ్యాధితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డా నాంగ్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశాడని మీడియా ప్రకటించింది. అయితే, ఈ మరణాన్ని వియత్నాం అధికారికంగా గుర్తించలేదు. వరుసగా 99 రోజులుపాటు కొత్తగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని దేశంగా వియత్నాం రికార్డ్ సృష్టించింది. కరోనాపై పోరాటంలో ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వియత్నాంలో గత వారం రోజుల్లో 90కిపైగా పాజిటివ్ కేసులు బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య శాఖ అధికారి తెలిపారు. -
కరోనా మృతులు 3 లక్షలు
వాషింగ్టన్: కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలు, ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. కరోనా కేసుల సంఖ్య 45 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3 లక్షలు దాటింది. అమెరికాలో ఇప్పటి వరకు 85,534 మంది మరణించగా పాజిటివ్ కేసులు 14.37 లక్షలకు మించిపోయాయి. కరోనాపై సకాలంలో చర్యలు తీసుకున్న న్యూజిల్యాండ్, జపాన్ ప్రభుత్వాలు క్రమేపీ ఆంక్షలు సడలించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఇథియోపియాలో మాస్కులు ధరించని వెయ్యిమందిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనాతో సతమతమవుతున్న ఫిలిప్పీన్స్‌పై తాజాగా టైఫూన్ ‘వొంగ్ఫాంగ్’ప్రభావం చూపుతోంది. ఫిలిప్పీన్స్ తూర్పు ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీకి ప్రత్యేక బృందం కరోనా టీకా తయారీతోపాటు అమెరికన్లందరికీ ఈ ఏడాది చివరికి దానిని అందుబాటులోకి తెచ్చే బాధ్యతను ప్రత్యేకంగా ఓ అధికారికి అప్పగించేందుకు అధ్యక్షుడు ట్రంప్ రంగం సిద్ధంచేశారు. ఫార్మా రంగానికి చెందిన గ్లాక్సో స్మిత్‌క్లైన్ సంస్థ మాజీ ఉన్నతాధికారి మోన్సెఫ్ స్లవోయీని ఇందుకు ఎంపిక చేశారు. మోన్సెఫ్ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోను న్నారు. ఈ బృహత్తర బాధ్యతల్లో ఆయనకు ఆర్మీ మెటీరియల్ కమాండ్ కమాండర్ జనరల్ గుస్తావ్ పెర్నా సహాయ పడతారు. ఇందుకు సంబంధించి ట్రంప్ త్వరలో ఒక ప్రకటనచేసే అవకాశముంది. ‘ఆపరేషన్ వార్ప్ సీడ్’అని పిలిచే ఈ ప్రత్యేక కార్యక్రమం లక్ష్యం..దేశంలోని పౌరులకు 30 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఈ ఏడాది చివరికల్లా తయారు చేయడం, అందరికీ పంపిణీ చేయడం. వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడమే ట్రంప్ లక్ష్యమని అధ్యక్ష భవనం వర్గాలు అంటున్నాయి. -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు
న్యూఢిల్లీ : మధుమేహం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మరో 39 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి చేర్చినట్లు జాతీయ ఫార్మా ధరల నిర్ణయాధికార సంస్థ (ఎన్పీపీఏ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దీని ప్రకారం సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, సెఫోటాక్సిమ్, పారాసెటమల్, డోమ్‌పెరిడోన్ తదితర ఫార్ములేషన్ల రేట్లను సవరించినట్లు పేర్కొంది. క్యాడిలా హెల్త్‌కేర్, లుపిన్, ఇప్కా ల్యాబరేటరీస్, అబాట్ ల్యాబరేటరీస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ తదితర ఫార్మా సంస్థలపై కేంద్రం నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎన్పీపీఏ ఇప్పటికే ధరల నియంత్రణ లిస్టులో సుమారు 500 పైచిలుకు ఔషధాలను చేర్చిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో జీఎస్కే మరో ఫార్మా యూనిట్
ముంబై: అంతర్జాతీయ ఔషధ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఇండియాలో మరో ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 8.5 కోట్ల పౌండ్లు(రూ. 864 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా 250 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ వ్యాపారవేత్తల సమావేశంలో భాగంగా ఇండియాకు వచ్చిన కంపెనీ సీఈవో ఆండ్రూ విట్టీ ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఔషధ తయారీ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేసేదీ ఇంకా నిర్ణయించలేదని చెబుతూ బెంగళూరు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించారు. ఇండియాలో దీర్ఘకాలంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న తమ సంస్థ ప్రజలకు చౌక ధరలలో ఔషధాలను అందించే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని చెప్పారు. దేశీయ మార్కెట్లకు ఔషధాలను అందించే ఈ ప్లాంట్ పూర్తయితే 800 కోట్ల ట్యాబ్లెట్లు, వంద కోట్ల క్యాప్సూల్స్‌ను తయారు చేయగలుగుతుందని తెలిపారు. 2017కల్లా ప్లాంట్ సిద్ధంకాగలదని భావిస్తున్నట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంలో కంపెనీ దేశీయంగా రూ. 1,017 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ మొత్తం 8,500 మంది సిబ్బందిని కలిగి ఉంది. కంపెనీ చర్మవ్యాధుల చికిత్సకు వినియోగించే ఔషధాలు, వ్యాక్సిన్ల విభాగంలో ముందుంది. కంపెనీ వినియోగదారుల విభాగం సైతం హార్లిక్స్ బ్రాండ్‌తో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. రాజమండ్రి, నాభా, సోనేపట్‌లో మూడు ప్లాంట్లలో వినియోగ సంరక్షణ ఉత్పత్తులు, నాసిక్‌లో రెండు ఔషధ ప్లాంట్లను కలిగి ఉంది.