సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారీ ఎత్తున సీనియర్లకు ఉద్వాసన చెప్పింది. నైపుణ్యకొరత, కొత్త టెక్నాలజీలకు అప్‌డేట్ కాని కారణంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ డైరెక్టర్లు, ఆపైస్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించింది.
నూతన సాంకేతిక అవసరాల కనుగుణంగా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా రెండువందలమంది సీనియర్ ఉద్యోగులను కాగ్నిజెంట్ తొలగించింది. వీరికి మూడునుంచి నాలుగు నెలల జీతాలు చెల్లించింది. ఆగస్టులో పూర్తయిన ఈ ప్రక్రియకోసం కంపెనీకి 35 మిలియన్ డాలర్లను వెచ్చించినట్టు సమాచారం. కంపెనీ లేదా దాని డైరెక్టర్లు, ఇతర అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదనే ఒప్పందంపై బాధిత ఉద్యోగులు సంతకం చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment