కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి.. ఉద్యోగులకు కష్టంకాలం మొదలైపోయింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గినా.. లేఆప్స్ మాత్రం తగ్గడమే లేదు. 2024 మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 80,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు.
సుమారు 279 టెక్ కంపెనీలు ఇప్పటి వరకు (మే 3 వరకు) 80,230 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఆర్ధిక అనిశ్చితుల కారణంగా.. లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. దీనికి తోడు కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు కూడా ఉద్యోగుల మీద తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
2024లో కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.ఏప్రిల్ నెలలో మాత్రమే దిగ్గజ కంపెనీలు 20000 కంటే ఎక్కువమందిని తొలగించాయి. టెకీల పరిస్థితి ప్రస్తుతం గాల్లో దీపం లాగా మారిపోతున్నాయి.
యాపిల్ కంపెనీలో స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 600 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ కూడా ఈ బాటలోనే అడుగులు వేసింది.
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో.. ఏకంగా 10 శాతం మందిని విధుల నుంచి తప్పించింది. ఓలా క్యాబ్స్ కూడా 10 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించింది. హెల్త్ టెక్ స్టార్టప్ కంపెనీ, వర్ల్ పూల్, టెలినార్ మొదలైన కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment