మెడకు స్టీమ్.. ముఖానికి క్యాబేజీ...
బ్యూటిప్స్
మెడ నల్లగా ఉందని ఎంతోమంది బాధపడుతుంటారు. కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కుంటారు. అలా కాకుండా రోజు కచ్చితంగా రెండుసార్లు సబ్బుతో మెడను శుభ్రం చేసుకోవాలి. అంతేకాకుండా వారానికి మూడుసార్లు పాటించాల్సిన చిట్కా ఒకటుంది. వేడి వేడి నీళ్లలో ఒక టవల్‌ను ముంచాలి. కొద్దిగా ఆ టవల్‌ను పిండి మెడపై నల్లగా ఉన్న ప్రాంతంలో బాగా రుద్దాలి. అలా చేస్తే మెడకు స్టీమ్ అందడంతో క్రమంగా నలుపు రంగు పోతుంది. అంతేకాకండా ఈ చిట్కాతో మెడ దగ్గర ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.
ముఖంపై చర్మం లూజ్‌గా ఉండటం వల్ల కొందరు తక్కువ వయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. అందుకు స్కిన్ టైటనింగ్ చిట్కా పాటిస్తే సరి. ముందుగా క్యాబేజీని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా బియ్యం పిండి, గుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని వారానికి ఒకసారి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. క్యాబేజీలోని విటమిన్-ఏ,బి, పొటాషియం, పాస్పరస్‌ల ప్రభావం వల్ల చర్మం లూజ్‌గా అయ్యే అవకాశాలు తగ్గుతాయి..