ముఖం కాంతిమంతంగా ఉండాలంటే...
బ్యూటిప్స్
⇒ రెండు టీ స్పూన్ల కీరదోసకాయ రసంలో రెండు టీ స్పూన్ల నిమ్మ రసం, రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మెరుస్తూ కోమలంగా ఉంటుంది.
⇒ టీ స్పూన్ బొప్పాయి గుజ్జులో అయిదారు చుక్కల తేనె, టీ స్పూన్ కమలాపండు రసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నునుపుగా మెరుస్తూ ఉంటుంది.
⇒ స్నానానికి 20 నిమిషాల ముందు చర్మానికి నిమ్మరసం పట్టించి, ఆ తర్వాత వేపాకులు వేసి మరిగిం చిన నీటితో స్నానం చేస్తే చర్మం చాలా మృదువుగా, కాంతివంతం గా తయారవుతుంది.
⇒ తాజా గులాబీ రేకులలో రెండు టీ స్పూన్ల పచ్చిపాలు కలిపి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కోమలంగా ఉంటుంది.