వాషింగ్టన్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్‌తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Here’s the whole clip of Donald Trump talking about the bloodbath. pic.twitter.com/pu8M35B5MR
— Molly Pitcher (@AmericanMama86) March 17, 2024
‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో బైడెన్ క్యాంపెయిన్ టీమ్ స్పందించింది. ‘ట్రంప్ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్‌లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్ టీమ్ ఎక్స్(ట్విటర్) పోస్టు చేసింది.
Biden-Harris campaign statement on Trump tonight promising a “bloodbath” if he loses pic.twitter.com/8mBYh4QKnf
— Biden-Harris HQ (@BidenHQ) March 17, 2024
కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్, ట్రంప్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్‌లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment