పుష్కరం.. పరవశం | pushkara happyness | Sakshi
Sakshi News home page

పుష్కరం.. పరవశం

Published Tue, Aug 23 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

పుష్కరం.. పరవశం

పుష్కరం.. పరవశం

 నెహ్రూనగర్‌ ఘాట్, ముచ్చుమర్రిలోని రాయలసీమ కృష్ణా పుష్కర ఘాట్‌ సోమవారం భక్తులతో పోటెత్తాయి. కృష్ణానదిలో పుష్కర స్నానం చేసి పరవశవులయ్యారు. పిల్లల కేరింతలు, పెద్దల భక్తిభావంతో ఘాట్లలో ఆధ్యాత్మిక ఆనందం వెల్లివెరిసింది. రాయలసీమ ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి 108 మట్టి శివలింగాలతో పురోహితుల మంత్రోచ్ఛరణల మధ్య మహా రుద్రయాగం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెహ్రూనగర్‌ ఘాట్‌ వద్ద టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త మాండ్ర శివానందరెడ్డి తన మాతృమూర్తికి పుష్కర స్నానం చేయించిన అనంతరం పితరులకు పిండ ప్రదానం చేశారు. కులమతాలకు అతీతంగా నందికొట్కూరు పట్టణానికి చెందిన రబ్బాని గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌ హాజీ మాబుసాహెబ్‌ రాయలసీమ పుష్కర ఘాట్‌ను సందర్శించి భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 
– పగిడ్యాల  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement