వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు! | Viral Video: Man Fearlessly Washing The Snakes Body As Puppy Bathing | Sakshi
Sakshi News home page

Viral Video: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు

Published Fri, Dec 2 2022 9:22 PM | Last Updated on Fri, Dec 2 2022 9:30 PM

Viral Video: Man Fearlessly Washing The Snakes Body As Puppy Bathing - Sakshi

ఇంతవరకు పాములకు సంబంధించిన భయానక స్టంట్‌లు చూశాం. వాస్తవానికి ఇది స్టంట్‌ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట  తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్‌ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది కూడా.

కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్‌ స్టంట్‌ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్‌ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా! అంటూ "చన్నీటితో కోబ్రాకి బాత్‌ " అనే క్యాప్షన్‌ జోడించి మరీ పోస్ట్‌ చేశాడు. 

(చదవండి: ఏనుగుల బ్రేక్‌ ఫాస్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement