venomous snake
-
ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..ఐనా ఆ వ్యక్తి..!
అమెరికాలో ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విషపూరితమైన పాము కాటుకు 172 సార్లు గురయ్యాడు. 20 సార్లు అతని పరిస్థితి చాలా విషమించడంతో అతను చనిపోతాడని అంతా భావించారు.. కానీ 2011లో అతను తన 100 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఈ వ్యక్తిని అమెరికాలో స్నాక్ మ్యాన్ అని పిలిచేవారు. ఈ వ్యక్తి తనను తాను పదే పదే పాముతో కరిపించుకోవడం వల్ల.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావించాడు. ఇతని పేరు బిల్ హాస్ట్. ఆయనను చిన్నప్పటి నుంచి ఎన్నో పాములతో కరిపించుకున్నాడు. దీనిని అతను తన వృత్తిగా మార్చుకున్నాడు. మొదట పాములను చంపిన అతను.. ఆ తర్వాత స్నేక్ మ్యూజియం ఏర్పాటు చేశారు. అసలు అతన్ని 172 సార్లు పాములు ఎలా కాటేశాయో వింటే కంగుతింటారు. వామ్మో..! ఇదేం పిచ్చిరా.. దేవుడా అని అంటారు. ఏం జరిగిందంటే.. బిల్ హాస్ట్ పాముల కోసం ఫ్లోరిడాలో మయామి సెర్పెంటారియంను నిర్మించాడు. అందులో ప్రతి జాతికి సంబంధించి ప్రమాదకరమైన పాములు ఉండేవి. అక్కడికి వచ్చేవారి కోసం షోలు నిర్వహించేవారు. నిజానికి అతని ప్రధాన వ్యాపారం పాము కాటుకు వ్యతిరేకంగా ఔషధాలను తయారు చేయడానికి ముడి విషాన్ని ఉత్పత్తి చేయడం. 1990ల నాటికి.. అతను ప్రతి సంవత్సరం ఫార్మాస్యూటికల్ లాబొరేటరీలకు 36 వేల విషం నమూనాలను అందించాడు.ఇలా బిల్ హాస్ట్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదివేలకు పైగా పాములు ఉన్నాయి. వీటిలో సముద్ర, ఆఫ్రికన్, కాటన్‌మౌత్, గిలక్కాయలు, నాగుపాములు, క్రైట్స్, గ్రీన్ మాంబాలు, టైగర్ పాములు, వైపర్లు అనేక ఇతర విషపూరిత జాతులు ఉన్నాయి. అయితే బిల్ హోస్ట్ తన జీవితంలో 17 సార్లు పాము కాటుకు గురికావడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ప్రాణాంతకమైన పాములను ఒట్టి చేతులతో పట్టుకుని వాటి దవడలు విప్పేవాడు. వాటి పదునైన దంతాలు రబ్బరు పొరలోకి చొచ్చుకుపోతాయి. దీంతో పాములోని విషం గాజు సీసాలోకి వస్తాయి. యాంటీవీనమ్‌ను తయారు చేయడానికి తగినంత విషాన్ని తయారు చేయడానికి ఈ ప్రక్రియ వేలసార్లు చేయాల్సి వచ్చింది.రోగనిరోధక శక్తి కోసం అని..నాగుపాము విషం ఇంజెక్షన్ సమయంలో హాస్ట్ ఎక్కువసార్లు కాటుకు గురయ్యేవాడు. కొన్నిసార్లు అతని పరిస్థితి విషమించింది. కాబట్టి దీనిని ఎదుర్కోవటానికి.. హాస్ట్ తనకు తానుగా చిన్న మొత్తాలలో నాగుపాము విషాన్ని ఇంజెక్ట్ చేయడం ప్రారంభించాడు. తద్వారా అతని శరీరం యాంటీ-వెనమ్ రోగనిరోధక శక్తిని పొందుతుంది. అతను దానిని కాలక్రమేణా క్రమంగా పెంచాడు. పాము కాటు చాలా వరకు అతనిని ప్రభావితం చేయకపోవడమే దీని ప్రయోజనం. 1954లో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన నీలిరంగు క్రైట్ కాటుకు గురయ్యాడు. అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అంతేకాకుండా.. 10 రోజుల తర్వాత ఆ పాము చనిపోయింది. నిజానికి ఈ పాము కాటుకు గురైన వారు ఎవరూ బతకలేదు. కాలక్రమేణా హాస్ట్ రక్తం పాము కాటుకు నివారణగా మారింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 20 మందికి పైగా ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది. అతను 100 సంవత్సరాల వరకు జీవించాడు.. పైగా తాను ఇంతలా సుదీర్ఘకాలం జీవించడానికి ప్రధానం కారణం తాను తీసుకున్న పాము విషం మోతాదని పేర్కొనేవాడు. 90 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, చురుకుదనంతో ఉన్న ఆయన ఆ తర్వాత కూడా చనిపోయేంత వరకు చురుకుదనం తగ్గలేదు.ఇక బిల్ హాస్ట్ అసలు పేరు విలియం ఎడ్వర్డ్ హాస్ట్.. 1910 డిసెంబర్ 30న న్యూజెర్సీలోని ప్యాటర్సన్ లో జన్మించాడు. ఏడేళ్ల వయసులో తొలి పామును పట్టుకున్నాడు. హైస్కూల్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత పాములను పట్టుకునే పనిలో పడ్డారు. ఆ తర్వాత పాన్ అమెరికన్ ఎయిర్ వేస్ లో మెకానిక్, ఫ్లైట్ ఇంజనీర్ గా పనిచేశాడు. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. అతను తరచూ తన పనిముట్లలో విదేశీ పాములను కూడా సేకరించేవాడు. ఇక వృద్ధాప్యంలో కూడా హాస్ట్ 32 బల్లులు, పాముల విషం మిశ్రమాన్ని తన శరీరంలోకి ఎక్కించాడు. బిల్ కు పాములపై ఉన్న మమకారం వల్ల అమెరికాలో స్నేక్ మ్యాన్ అని పిలిచేవారు.(చదవండి: మన దేశంలో అత్యంత చెత్త వంటకాలు ఇవే..! అందులో ఉప్మా..!) -
పాము కాటు వేయగానే ఏం జరుగుతుందో లైవ్‌లో చూసేయండి!
మన దేశంలో పాము కాటుకు ఏటా వేలాదిమంది చనిపోతున్నారు. పాము కాటు వేసిన వెంటనే విషం బాడీలోకి వెళ్లి..మనిషి నురగలు కక్కుకుంటూ చనిపోవడం జరుగుతుంది. మరింత విషపూరితమైన పాము అయితే అంతా క్షణాల్లో అయిపోతుంది. ఒక్కోసారి మనం వైద్యుడు వద్దకు తీసుకువెళ్లే వ్యవధి కూడా సరిపోదు. సకాలంలో రోగికి విరుగుడు ఇంజెక్షన్ అందితే ఓకే లేందంటే అంతే సంగతి. ఇక్కడ విషం శరీరంలోకి వెళ్లిన వెంటనే ఏం జరగుతుందనేది అందరికి కుతుహలంగానే ఉంటుంది కదా. అయితే పాము విషం ఎలా మన శరీరంలో రక్తంతో రియాక్షన్ చెందుతుందో ఈ వీడియో ద్వారా ప్రత్యక్ష్యంగా తెలుసుకోండి పాము మానవ రక్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ప్రయోగం చేసి మరీ చూపించారు.ఈ వీడియోలో, ఒక నిపుణుడు గాజు పాత్రలో పాము విషాన్ని సేకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ విషం ఇప్పటికే నిల్వ చేయబడిన మానవ రక్తంతో ఎలా రియాక్షన్ చెందుతుందో చూపించడం జరగుతుంది. పాము విషం జస్ట్ ఒక్క చుక్క రక్తంలో కలవగానే రక్తం గడ్డకట్టడం కనిపిస్తుంది. ఒక్క విషపు చుక్క ఎంత స్పీడ్‌గా ప్రభావితం చేస్తుందో వీడియోలో క్లియర్‌గా తెలుస్తుంది. ఎప్పుడైతే రక్తం గడ్డకట్టుకుపోతుందో అప్పుడూ గుండెకు రక్తం సరఫరా అవ్వడం నిలిచిపోతుంది. వెంటేనే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అందవల్ల పాము ఎలాంటిది కరిచినా వెంటనే ఆ ప్లేస్‌ని క్లాత్‌తో గట్టిగా కట్టి సకాలంటో వైద్యుల వద్దకు తీసుకువెళ్లి విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. అంతేగాదు ఈ పాము కాటు కారణంగా భారతదేశంలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నట్లు ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించిది. గత 20 ఏళ్లలో ఏకంగా 2 లక్షల మంది పాముకాటుతోనే చనిపోయినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంటే ప్రతీ ఏడాది పాముకాటు కారణంగా దాదాపు 58 వేలమంది దాక చనిపోతున్నట్లు లెక్కలు వేసి మరీ పేర్కొంది. అలాగే ప్రభుత్వ లెక్కల్లోకి రాని పాము కాటు మరణలు ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆరోగ్య సంస్థ తెలపడం గమనార్హం. Effect of snake venom on blood! pic.twitter.com/QDUC9I2vtg — Learn Something (@cooltechtipz) March 7, 2024 (చదవండి: సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి త్రీ సీక్రెట్స్ ఇవే!) -
ఒడిశాలో దారుణం.. భార్య, రెండేళ్ల కూతురిపై విష సర్పాన్ని వదిలి
ఒడిశాలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్య, రెండేళ్ల కూతురుపట్ల ఓ వ్యక్తి కాలయముడిగా మారాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో అత్యంత్య హేయంగా వారిద్దరిని అంతమొందించాడు. నెలన్నర క్రితం జరిగిన ఈ అమానుష ఘటనలో అతడి ప్రమేయం ఉన్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గంజయ్ జిల్లా కబీసూర్య నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధెగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేష్ పత్రాకు బసంతి(23) అనే యువతి 2020లో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమార్తె దేవస్మిత ఉంది. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారిని అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నాడు. గత నెల అక్టోబర్ 6న పాములు ఊదే వ్యక్తి నుంచి విషపూరిత సర్పాన్ని ప్లాస్టిక్ డబ్బాలో ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పామును భార్య, కూతురు నిద్రిస్తున్న గదిలో వారి మంచం వద్ద వదిలిపెట్టాడు. అతడు మరో గదిలో నిద్రించాడు. ఉదయం అయ్యే సరికి భార్య, కూతురు ఇద్దరు మంచం మీద పాము కాటుతో మరణించి కనిపించారు. తనకేం తెలియదన్నట్లు నటించిన భర్త.. భార్య, కూతురు మరణంపై పోలీసులకు సమాచారం అందించాడు. తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే తన కూతురిని అల్లుడే హత్య చేశాడంటూ బాధితురాలి(భార్య) తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడంలో ఆలస్యం కావడంతో ఘటనా జరిగిన నెల తర్వాత అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో పాము తనంతట తానే గదిలోకి ప్రవేశించి ఉండవచ్చని బుకాయించిన నిందితుడు తరువాత చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తెలిపారు. చదవండి: అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి -
భూమిపై అత్యంత విషపూరిత జంతువులు ఫోటో గ్యాలరీ
-
భారతదేశంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
ప్రపంచంలోని టాప్ 10 విషపూరిత పాములు
-
Karnataka assembly election 2023: వారికి మతి పోయింది
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు. పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. -
ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్..
Inland Taipan: ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. పేరు ఇన్లాండ్ టైపాన్.. ఇది ఎంత విషపూరితమైనది అంటే.. ఒక్క కాటు విషంతో వంద మంది మనుషులు ఖతమేనట. అదే ఎలుకల లెక్క తీసుకుంటే.. 2,50,000 మూషికాలు ఫసాక్. దాని ఒక్క కాటులో 110 మిల్లీగ్రాముల విషం వెలువడుతుందని బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మన అదృష్టమేంటి అంటే.. ఈ ప్రమాదకర పాములు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంటుంది. అది కూడా మారుమూల అటవీప్రాంతాల్లోనే సంచరిస్తుంటాయి. పగటిపూట ఇవి కనిపించడం చాలా తక్కువ అని పరిశోధకులు తెలిపారు. ఇన్లాండ్ తైపాన్ పాము సగటున 1.8 మీటర్ల పొడవు పెరుగుతుంది. వీటి కోరలు 3.5 నుంచి 6.2 మిమీ పొడవు ఉంటాయి. ఇవి కాలాన్ని అనుసరించి చర్మం రంగును మార్చుకుంటాయి. చలికాలంలో ముదురు గోధుమ రంగులోనూ, వేసవిలో లేత గోధుమ రంగులోనూ కనిపిస్తాయి. చదవండి: యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం -
వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు!
ఇంతవరకు పాములకు సంబంధించిన భయానక స్టంట్లు చూశాం. వాస్తవానికి ఇది స్టంట్ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది కూడా. కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్ స్టంట్ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా! అంటూ "చన్నీటితో కోబ్రాకి బాత్ " అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) (చదవండి: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!) -
విషనాగుకే బలైన ‘స్నేక్‌మ్యాన్’ వినోద్
జైపూర్: ఆయన అనుభవం అలాంటిది ఇలాంటిది కాదు. ఏకంగా 20 ఏళ్లుగా పాములు పట్టే పని చేశారు. ఊరుకాదు.. ఏకంగా జిల్లాలో ఏ ఇంట్లో, దుకాణాల్లో పాములు దూరినా పట్టేసి అడవిలో భద్రంగా వదిలి వచ్చేవారు. అందుకే ఆయనంటే అందరికీ గౌరవం. అలాంటి వ్యక్తి చివరకు.. పాముకాటుతో విషం ఒంటికెక్కి నిమిషాల్లోనే కుప్పకూలి మరణించాడు. రాజస్థాన్ చురు జిల్లాకు చెందిన వినోద్ తివారీ(45)కి ‘స్నేక్ మ్యాన్’గా పేరుంది. చురు జిల్లాలో ఎక్కడై.. ఏమూల అయినా ‘పాము’ అనే పిలుపు అందుకుంటే చాలు.. వెళ్లి తన పని చేసేవాడు. ఈ క్రమంలో.. శనివారం సాయంత్రం గోగమెడి ప్రాంతంలో ఓ నాగుపామును పట్టేశాడు. అయితే దానిని పట్టే క్రమంలో అది వేలిని కాటేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరగడంతో.. ఆయన ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ముందు పామును దూరంగా వదిలొచ్చి.. ట్రీట్మెంట్కు వెళ్లాలని భావించారు. ఓ సంచిలో దానిని వేసుకుంటూ కాస్త ముందుకు వెళ్లగానే.. అలాగే కుప్పకూలిపోయారు. స్థానికులు అది గమనించి ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. కాటేసిన నాగులో విషం మోతాదు అధికంగా ఉండడంతో ఆయన వెంటనే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను గ్రామస్తులు దగ్గరుండి నిర్వహించారు. ప్రస్తుతం వినోద్ పామును పట్టి గాయపడిన వీడియో ఒకటి ట్విటర్లో వైరల్ అవుతోంది. #Rajasthan | चुरु में सांप को पकड़ने आए विनोद तिवाड़ी को कोबरा ने काटा, कुछ ही मिनटों में हुई मौत, घटना हुई CCTV में कैद.#Snakeman #CobraBite #SnakeBite #ChuruDistrict #CCTVFootage #SardarShaharTown #Trending #abcnewsmedia #राजस्थान pic.twitter.com/HDjtJDsZMD — Abcnews.media (@abcnewsmedia) September 13, 2022 -
పాముల్లాగే.. మన లాలాజలంలో విషం ఊరే అవకాశం!
పాముకు కోరల్లో విషం ఉంటుంది.. తేలుకు తన తోకలో ఉంటుంది.. అయితే మనిషికి నిలువెల్లా విషం ఉంటుంది అంటుంటారు.. ఇప్పటివరకైతే మనిషి శరీరంలో విషం (వెనమ్) ఉన్న ఆనవాళ్లు లేవు కానీ.. సమీప భవిష్యత్తులో పాముల మాదిరిగానే మన లాలాజలంలో విషం ఊరే అవకాశం ఉందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇదీ మానవ పరిణామంలో ఒక భాగమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మేరకు జపాన్‌లోని ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పిట్ వైపర్ (రక్త పింజర) పాములపై పరిశోధనలు చేశారు. ఈ పాముల్లోని కోరల్లో విషానికి సంబంధించిన జన్యువుల గురించి తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు సాగాయి. ఈ క్రమంలో నోటిలో విష స్రావాలు వచ్చేందుకు దోహదపడే జన్యువులు.. సరీసృపాల (పాము జాతి)తో పాటు మానవుల్లో కూడా ఉన్నాయని, దీన్నిబట్టి మానవులు కూడా భవిష్యత్తులో విషం కక్కే రోజులు వస్తాయని చెబుతున్నారు. మానవుల లాలాజల గ్రంథులు, పాముల్లోని విష గ్రంథుల అమరిక కణ స్థాయిలో ఒకేరకంగా ఉంటాయని రుజువులు చూపిస్తున్నారు. అందుకే తాము ఈ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నామని పేర్కొంటున్నారు. విషం అనేది ప్రోటీన్ల మిశ్రమం అని, జంతువులు తమ ఆహారాన్ని కదలకుండా చేసేందుకు, స్వీయ రక్షణ కోసం ఈ ఆయుధాన్ని వాడుతాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న అగ్నీశ్ బారువా అనే పరిశోధకుడు వివరించారు. ఇలాంటి విషం కొన్ని క్షీరదాలతో పాటు జెల్లీఫిష్, తేళ్లు, సాలీళ్లు, పాముల్లో ఉంటుంది. చాలా జంతువులు తమ నోటి ద్వారానే విషం విడుదల చేస్తాయి. విషంలోని ప్రోటీన్ల మిశ్రమం తయారయ్యేందుకు ప్రభావితం చేసే జన్యువుల గురించి గతంలో పరిశోధనలు జరిగాయి. కానీ తాజాగా వివిధ జన్యువులు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావితం చేసుకుంటాయని పరిశోధనలు చేస్తున్నాయి. ‘విషం, విష గ్రంథులు ఆవిర్భవించక ముందు ఉన్న జన్యువులు, విష వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించిన జన్యువుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని బారువా చెప్పారు. ఇందుకోసం తైవాన్‌కు చెందిన హబు పాముల విషంపై కూడా అధ్యయనం చేశారు. దాదాపు 3 వేల ‘సహకార’ జన్యువులను వీరు గుర్తించారు. చాలా జంతువుల్లో గుర్తింపు.. ఇలాంటి జన్యువులు మరే జంతువుల్లోనైనా ఉన్నాయా అని పరిశోధకులు వెతికారు. కుక్కలు, చింపాంజీలు, మానవుల వంటి క్షీరదాల్లో వాటి వెర్షన్లలో ఈ జన్యువులు ఉన్నట్లు గుర్తించారు. క్షీరదాల్లోని లాలాజల గ్రంథుల నిర్మాణం, కణాల అమరిక అచ్చు.. పాముల్లోని విష గ్రంథులలాగే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ రెండు జాతులు కోట్ల సంవత్సరాల కింద వేరు పడటానికి ముందు నుంచీ ఈ గ్రంథులకు సంబంధించి ఒకే మూలాలు కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పర్యావరణ పరిస్థితులు కనుక మనకు అనుకూలంగా లేకపోతే త్వరలోనే మన లాలాజల గ్రంథులు కాస్తా విష గ్రంథులుగా రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు! – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. అయినా వాటికి అదే ఇష్టం! యాంటీ బయోటిక్స్ అని వాడితే.. చివరికి అవే విషంలా -
ఈ కప్ప నిజంగా లక్కీఫెలో
సాధారణంగా కప్పలను పాములు మింగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కప్ప ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కోస్టల్ తైపన్ పామును మింగి కూడా ఎప్పటిలాగే ఉండడం విశేషం. అంతేగాక కప్ప పామును మింగేటప్పుడు పలుసార్లు కాటు వేసినా దానికి ఏ విధమైన హాని కలగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఈ వింత ఘటన ఫిబ్రవరి 4న చోటు చేసుకున్నప్పటికి టౌన్స్‌విల్లే అనే యనిమల్ స్వచ్చంద సంస్థ తన ఫేస్బుక్ పేజీలో ఆరోగ్యంగా ఉన్న కప్ప ఫోటోలను పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ అయ్యాయి. 'ఇప్పటివరకు మేము చూడని ఒక వింత ఘటన మమ్మల్ని చాలా ఆశ్యర్యపరిచింది. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కోస్టల్ తైపన్ను ఆకుపచ్చ రంగులో ఉన్న కప్ప మింగడం చూశాము. మేము పామునైతే కాపాడలేకపోయాం కానీ.. దానిని మింగేటప్పుడు ఆ పాము కప్పను పలుసార్లు కాటేయడం గమనించాము. అప్పటికే కప్ప వెనుక శరీర భాగంలో ఆకుపచ్చ రంగులో కొన్ని డాట్స్ కనిపించడంతో ఇక ఎక్కువసేపు బతకదనే భావించాము' అంటూ పోస్ట్ చేశారు. వెంటనే ఆ కప్పను స్వచ్చంద సంస్థకు తరలించి అబ్జర్వేషనలో పెట్టారు. తాజాగా కప్పకు సంబందించిన మరికొన్ని ఫోటోలను ఆ సంస్థ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. 'పామును మింగినా కప్ప ఆరోగ్యంగానే ఉంది. అది పూర్తిగా కోలుకోగానే దానిని వదిలిపెడతాం' అని పేర్కొన్నారు. ఈ ఫోటోలకు 1.7 మిలియన్ లైకులు వచ్చాయి.' ఇది నిజంగా అద్భుతం. అంత విషపూరితమైన పామును తిని కూడా కప్ప బతికింది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
గాఢ నిద్రలో ఉండగా ముగ్గురిని కాటేసిన కట్లపాము
సాక్షి, మహబూబాబాద్ : అత్యంత ప్రమాదకరమైన ఓ పాము ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులపై విషం చిమ్మింది. గాఢ నిద్రలో ఉండగా కాటు వేసింది. వారిలో ఒకరు ప్రాణాలు విడువగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో చోటుచేసుకుంది. వివరాలు... జాతోట్ రవి (38), అతని భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఐదడుగుల కట్లపాము గత రాత్రి ముగ్గురినీ కాటు వేసింది. భర్త జాతోట్ రవి మృతి చెందగా.. భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వారిని తరలించారు. కట్లపాము అత్యంత విషపూరితమైందని స్నేక్ క్యాచర్లు చెప్తున్నారు. మరొకరు బలి... మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్య దేవిపల్లి గ్రామంలో పాముకాటుతో గంగారపు వెంకన్న అనే వ్యక్తి మరణించాడు. ముడురోజులక్రితం బోడ కాకరకాయలు కోస్తుండగా పాము కాటేసింది. చికిత్స నిమిత్తం బంధువులు ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటిక్రితం మృతి చెందినట్లుగా సమాచారం. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రు తండాలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పాము కాటుకు గురవడం. వారిలో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. పాము కాటుతో ఒకే రోజు రెండు మరణాలు సంభవించడంతో కలకలం రేగింది. -
పాములను ప్రేమించే శ్రీను ఇకలేడు..
సాక్షి, పటాన్చెరు: అతడు పాములను ప్రేమించేవాడు. ఎవరైనా పాము అని భయపడుతున్నారంటే వారి భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకునేవాడు. వాటిని మనుషుల సంచారం లేని చోట సురక్షితంగా వదిలివేసేవాడు. ఇది అతడి వృత్తి కాదు.. ప్రవృత్తి. పాములు పట్టడం అతడికో హాబీ.. ఇంట్లోవాళ్లు వద్దన్నా వినేవాడు కాదు. అతడికి ఉద్యోగం ఉంది. అయినా పాములంటే భయపడే జనానికి ఊరట కలిగించడానికి వాటిని పట్టుకోవడం అభిరుచిగా పెట్టుకున్నాడు. చివరికి ఆ హాబీ అతడి ప్రాణం తీసిన హృదయ విదారక సంఘటన పటాన్చెరు ప్రజలను కలచివేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో, గ్రామంలో, జిల్లాలో ఇతర చోట్ల ఎక్కడైనా పాము కనిపిస్తే ముందుగా అందరికి అభిరుచిగా పాములు పట్టే వ్యక్తి శ్రీనివాస్ ముదిరాజ్ అలియాస్ ధనుష్ గుర్తుకు వచ్చేవాడు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో కొంత కాలంగా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన రాజు, జయలక్ష్మిలు ముగ్గురు పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 30 సంవత్సరాల క్రితం పటాన్చెరు పట్టణానికి వచ్చి శాంతినగర్ కాలనీలో ఉండేవారు. రాజు, జయలక్ష్మిల పెద్ద కూతురు వివాహం కాగా, రెండో కుమారుడు శ్రీనివాస్ ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఎవరైనా పాములు తిరుగుతున్నాయని, ఇబ్బందులు పడుతున్నామని చెపితే చాలు శ్రీనివాస్ ఉచితంగా పాములను పట్టి మనుషులు తిరగని చోట్ల వదిలే వాడు. ఇది అతడికో హాబీగా మారింది. పాములు పట్టొద్దని ఇంట్లో వారు చెప్పినా సరే వారికి చెప్పకుండా వెళ్లి అదే పని చేసేవాడు. అలాంటి శ్రీనివాస్ గురువారం వికారాబాద్ జిల్లాకు పనిపై వెళ్లగా అక్కడ మోమిన్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చిందని ఫోన్ రావడంతో అక్కడే ఉన్న శ్రీను దాన్ని పట్టడానికి వెళ్లాడు. అయితే పామును పట్టే క్రమంలో అది రెండు సార్లు శ్రీనివాస్‌ను కాటు వేసింది. అయినా ఆ పామును పట్టుకొని భద్రపరిచాడు. అనంతరం సదాశివపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వార్త తెలియడంతో పటాన్చెరు పట్టణంలో విషాదం అలుముకుంది. -
ఆట బొమ్మల మధ్య పాము..వైరల్!
-
చిన్నారి గదిలో నల్లతాచు : వీడియో వైరల్
పెర్త్, ఆస్ట్రేలియా : నేనైతే చచ్చి ఊరుకునే వాడిని.. ఎంత ప్రమాదం తప్పింది. దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. హో గాడ్..! పాపని రక్షించావ్. ఏంటీ.. విషయం చెప్పకుండా భయపెట్టే మాటల్ని పరిచయం చేస్తున్నారు. అనుకుంటున్నారా..! ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు. బుసలు కొడుతున్న ఓ పొడవాటి నల్లతాచు వీడియో చూసి నెటిజన్లు పెట్టిన కామెంట్లు. ఆస్ట్రేలియాలోని ఓ ఇంట్లో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్న ఓ చిన్నారి ఆట బొమ్మల్లో నల్లని తాచు పాగా వేసింది. దాన్ని చూసి ఆ చిన్నారి తండ్రి ఒక్క నిమిషం షాక్‌కు గురయ్యాడు. నోట మాట రాక అలా.. నిలబడిపోయాడు. వెంటనే తేరుకుని పాము తప్పించుకు పోకుండా కిటికీలు, డోర్లు అన్నింటినీ మూసేసీ పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. స్నేక్ క్యాచర్ వచ్చి ఆ కాల నాగుని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాము ఆట బొమ్మల్లో దూరినపుడు చిన్నారి ఆ గదిలో లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఆమె తల్లి చెప్పారు. ఆట బొమ్మల్లో దాక్కున్న పాముని పట్టుకునే క్రమంలో స్నేక్ క్యాచర్ ఆండ్రూస్ తీసిన వీడియో ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. నల్లగా మెరుస్తూ.. బుసలు కొడుతున్న కాలనాగు వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించాల్సిందే. -
నాగుపాములు మాత్రమే అలా చేస్తాయట..
ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నాగుపాములకు కళ్లు కనిపించవనే అపోహ ఉంది. కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్లు చక్కగా కనిపిస్తాయి. దానికితోడు వాటికి అద్భుతమైన ఘ్రాణ శక్తి కూడా ఉంటుంది. అంటే వివిధ వాసనలను బట్టి కూడా పరిసరాల్లో ఏమేం ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవన్నమాట. అంతేగాక, ఉష్టోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి. వీటన్నింటి ఆధారంగా నాగుపాములు రాత్రివేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడి, ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఓ గూడును కట్టే ఏకైక పాములు- నాగుపాములే. అదేవిధంగా, శత్రుజీవులపైనా గాని, లేదా తాము వేటాడదలచుకున్న జీవులపై గాని, విషాన్ని ఉమ్మగలిగే జీవుల్లో ఆ పనిని కచ్చితంగా చేయగలిగేవి కూడా ఇవే. ఇవి తమ పొడవులో సగం దూరం దాకా, సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి. అంటే శత్రు జీవుల కంటి దగ్గర పడాలనుకుంటే కంటి దగ్గర, ముక్కు దగ్గర పడాలనుకుంటే ముక్కు దగ్గర... ఇలా అన్నమాట. అన్నట్లు నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. నాగుపాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. -
పాముకాటుకు 45 వేలమంది మృతి
న్యూఢిల్లీ: పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతియేటా పాముకాటుకారణంగా చనిపోతున్నవారు ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 45 వేలమంది. ప్రతి ఏడాది 45 వేలమంది పాముకాటుకారణంగా చనిపోతుండగా.. దాదాపు 2లక్షలమంది అంగ విచ్ఛేదనానికి గురవుతున్నారు. ది ఇంటరాక్షన్ అనే కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని తెలిపారు. ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని హెచ్చరించారు. పాముకాటుకు గురైన వారిల్లో ఏడుగురులో ఒక్కరు మాత్రమే ఆస్పత్రికి చేరగలుగుతున్నారని, అప్పటికీ ఆలస్యం కారణంగా వారు ప్రాణాలువిడుస్తున్నారని తెలిపారు. ఎక్కువమంది పొలాల్లో పనులకు నిమగ్నమై ఉన్నప్పుడే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, నిర్లక్ష్యం, సౌకర్యాలు, మౌలిక వసతుల ఏర్పాట్ల లేమి వల్ల పాముకాటుకు గురైన వారు ప్రాణాలుకోల్పోవల్సి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలోని అంధరి టైగర్ రిజర్వకు సమీపంలో చిరాగ్ రాయ్ అనే వ్యక్తి పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇతడు పాముల విషయంలో నిపుణుడు అయినప్పటికీ ఆస్పత్రికి చేరుకునేలోగానే ప్రాణాలుకోల్పోయాడు. అందుకు ప్రధాన కారణం దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషజాతి సర్పాలు ఈ ప్రాంతంలో ఉండటం. ముఖ్యంగా కోబ్రా నాగుపాము చాలా అపాయకరమైనది. ఈ పాముల విషయంలో ముందు జాగ్రత్తలు పాటించకుంటే మాత్రం విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. -
ఊహించని ట్విస్ట్: పాము కాటేసిందని..
రాంచీ: జార్ఖండ్‌లో ఓ గిరిజనుడు విచిత్రమైన చర్యకు పాల్పడ్డాడు. విషపూరితమైన పాము తననకు కాటేయడంతో అతను ఆ పామును బతికుండగానే తినేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీకి 60 కిలోమీటర్ల దూరంలోని లోహర్దగా జిల్లాలోని హమ్రు గ్రామంలో జరిగింది. 30 ఏళ్ల సురేంద్ర ఓరాన్ తన పొలంలో పనిచేసుకుంటుండగా అతన్ని పాము కరిచింది. దానికి అతను భయపడకపోగా.. ఆ పామును పట్టుకొని తినేశాడు. తలభాగం మినహా పూర్తిగా స్వాహా చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లగానే అతని పరిస్థితి క్షీణించింది. జరిగిన ఘటన గురించి అతను కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగానే ఉంది. వైద్యులు అతనికి చికిత్స అందించి శనివారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఓరాన్‌కు చికిత్స అందించిన డాక్టర్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ 'రాత్రి మొత్తం అబ్జర్వేషన్లో పెట్టాం. అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా బాగుండటంతో శనివారం ఉదయమే అతన్ని డిశ్చార్జ్ చేశాం' అని చెప్పారు. పాము కరిచిన తర్వాత దానిని తింటే బాధితులకు ఏమీ కాదని, విషం ఎక్కదని పలువురు చెప్పడంతో తాను విన్నానని, అందుకే అలా చేశానని ఓరాన్ చెప్తున్నాడు. జార్ఖండ్‌లోని కొల్హాన్ గిరిజన తెగకు ఇలాంటి నమ్మకాలు అనేకం ఉన్నాయి. గబ్బిలాలను తింటే బ్రెయిన్ స్ట్రోక్ రాదని, ఎలుగుబంట్లను తింటే మలేరియా రాదని, ఎండ్రికాయలను తింటే లైంగిక శక్తి పెరుగుతుంతని ఇక్కడి గిరిజనులు నమ్ముతారు. అంతేకాదు కరిచిన పామును తినడం వల్ల బాధితులు బతికిన ఘటనలు నాలుగైదు తమ ప్రాంతంలో జరిగాయని వారు చెబుతారు. -
పాముతో 40 నిమిషాలు !
హైదరాబాద్ : ఒకటి..రెండు కాదు ఏకంగా నలభై నిమిషాలు ఓ విషసర్పం వృద్ధురాలి కాలిని చుట్టుకుంది. అది ఎక్కడ కాటు వేస్తుందోనని ఆమె వణికిపోయింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన మంగళవారం హయత్‌నగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వృద్ధురాలు కొండ్రు బాలమ్మ (91) ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఉంది. చెట్ల పొదల నుంచి వచ్చిన తాచుపాము ఆమె కాలుకు చుట్టుకుంది. దీంతో ఆమె భయంతో వణికిపోయింది. సుమారు 40 నిముషాల పాటు ఆమె కాలుకు పాము చుట్టుకుని ఉంది. దీన్ని గమనించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చెందారు. కాటు వేయకుండా పాము వెళ్లిపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. హయత్‌నగర్ 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బాలమ్మకు ప్రథమ చికిత్స అందించారు.