ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో నాగుపాములకు కళ్లు కనిపించవనే అపోహ ఉంది. కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్లు చక్కగా కనిపిస్తాయి. దానికితోడు వాటికి అద్భుతమైన ఘ్రాణ శక్తి కూడా ఉంటుంది. అంటే వివిధ వాసనలను బట్టి కూడా పరిసరాల్లో ఏమేం ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవన్నమాట. అంతేగాక, ఉష్టోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి. వీటన్నింటి ఆధారంగా నాగుపాములు రాత్రివేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడి, ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఓ గూడును కట్టే ఏకైక పాములు- నాగుపాములే.
అదేవిధంగా, శత్రుజీవులపైనా గాని, లేదా తాము వేటాడదలచుకున్న జీవులపై గాని, విషాన్ని ఉమ్మగలిగే జీవుల్లో ఆ పనిని కచ్చితంగా చేయగలిగేవి కూడా ఇవే. ఇవి తమ పొడవులో సగం దూరం దాకా, సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి.
అంటే శత్రు జీవుల కంటి దగ్గర పడాలనుకుంటే కంటి దగ్గర, ముక్కు దగ్గర పడాలనుకుంటే ముక్కు దగ్గర... ఇలా అన్నమాట. అన్నట్లు నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది. నాగుపాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment