భువనేశ్వర్: పాము గుడ్లు పెడుతుందని అందరికీ తెలిసిందే. కానీ అది గుడ్లు పెట్టడాన్ని ప్రత్యక్షంగానో లేక పరోక్షంగా గానీ చూసిన వారు చాలా తక్కువ. ఇలాంటి అరుదు సంఘటలను చూడాలని ఉంటుంది. అలాంటి ఔత్సాహికుల కోసం పాము గుడ్లు పెట్టడాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చయడంతో వీడియో వైరల్ అవుతోంది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన ఇండియన్ కోబ్రా.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ ఇంట్లోకి వచ్చింది. స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తి ఈ కోబ్రాను ఆ ఇంటి నుంచి తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేయడానికి ప్రయత్నించగా.. అది అప్పటికే కొన్ని గుడ్లు పెట్టడం గమనించాడు. దీంతో ఆయన స్నేక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాడు.
అధికారులు ఆ పామును తమ వద్దకు తీసుకురావాలన్నారు. అక్కడ ఆ పాము గుడ్లు పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఆ పాము మొత్తం 23 గుడ్లు పెట్టింది. ఇదంతా అక్కడి జనరల్ సెక్రటరీ బుభేందు మాలిక్ వీడియో తీశాడు. సాధారణంగా పాము గుడ్లు పెట్టే సమయంలో చూడటం చాలా అరుదు. అందుకే తాను ఈ వీడియో తీశానని స్నేక్ హెల్ప్‌లైన్ జనరల్ సెక్రటరీ చెప్పారు. గుడ్లన్నీ పెట్టిన తర్వాత ఆ పామును అడవిలో వదిలేశారు. గుడ్లను కృత్రిమంగా పొదుగిస్తారట. 60 రోజుల తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చే ఈ పాములను అడవుల్లో వదిలేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment