
మానవుడికి అత్యంత హానికరమైన విషాలతోనే ప్రాణాలను కాపాడే శక్తిమంతమైన ఔషాధాలను తయారు చేశారు శాస్త్రవేత్తలు. అత్యంత ప్రమాదకరమైన పాయిజన్ల నుంచే డయాబెటిక్, ఊబకాయం, బ్రెయిన్ ట్యూమర్, లుకేమియా వంటి కేన్సర్‌లను నివారించే ఔషధాలను తయారు చేశారట పరిశోధకులు. అసలు పాయిజన్లతో ప్రమాదకరమైన వ్యాధులను నివారించే ఔషధాల ఆవిష్కరణ ఎలా జరిగింది..?. ఏ విష జంతువు పాయిజన్‌తో ఎలాంటి మందులను తయారు చేశారు తదితరాల గురించి చూద్దాం.!
గిలా మాన్ స్టర్ అనే బల్లిలో విషపూరితమైన పాయిజన్ ఉంటుంది. వీటిని అమెరికాలో కొందరు పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. అయితే దీనిలో ఉండే విషం మానవులు ప్రాణాలను హరిస్తుంది. ఈ విషంతో శాస్త్రవేత్తలు ఓజెంపిక్ అండ్ వెగోవీ వంటి ఆధునిక మందులను తయారు చేశారు. వీటిని డయాబెటిస్, ఊబకాయం చికిత్సలలో ఉపయోగిస్తారు.
20 వ శతాబ్దంలో ఆకలిని అణిచివేసే డ్రగ్‌ని కనిపెట్టే పనిలోపడ్డారు పరిశోధకులు. అలా గిలా అనే రాక్షస బల్లిలో ఆకలిని నియంత్రించే జీఎల్‌పీ-1ని పోలి ఉండే ప్రోటీన్‌ని గుర్తించారు. దాంతో ఆ పాయిజన్‌తో డయాబెటిక్‌ని కంట్రోల్ చేసే డ్రగ్‌ని, ఓబిసెటీకి చెక్‌పెట్టే మందులను తయారు చేశారు.
రక్తపింజరి విషంతో..
అలాగే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన మందులలో ఒకటైన లిసినోప్రిల్ డ్రగ్ ఒకటి. ఇది రక్తపోటుని సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఇది దేనితో తయారు చేశారో వింటే షాకవ్వుతారు. రక్తపోటుని తగ్గించగలిగే ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇది శరీరంలోని రక్తనాళాలను గట్టిగా కుదించకుండా నిరోధిస్తుంది. దీన్ని బ్రెజిలియన్ వైపర్(ప్రమాదకర రక్తపింజరి) విషం నుంచి తయారు చేశారట పరిశోధకులు. ఇది గుండెపోటు చికిత్సలో కూడా ఉపయోగిస్తారట.
కీమో థెరపీ ఔషధాలుగా..
అలాగే పురాతన సముద్రస్పాంజ్‌ల కూడా ఆధునిక చికిత్సలో ఉపయోగిస్తున్నారట పరిశోధకులు. ముఖ్యంగా కరేబియా స్పాంజ్ నుంచి తయారు చేసిన ఔషదాలు లుకేమియా, నాన్‌హాడ్జికిన్స్ లిఫోమా వంటి కేన్సర్ చికిత్సలలో ఈ డ్రగ్‌ని కీమోథెరపీ ఔషథంగా ఉపయోగిస్తారట.
తేలు విషం కూడా అద్భుతమైన వైద్య పురోగతిని అందించిందట. 2004లో, ఆంకాలజిస్ట్ జిమ్ ఓల్సన్ ఒక టీనేజ్ అమ్మాయి తలలోని బ్రెయిన్ ట్యూమర్‌ని తొలగించడానికి 14 గంటల పాటు క్రిటికల్ సర్జరీని చేశారు. అయితే బొటనవేలంత పరిమాణంలోని కేన్సర్ కణాలు తొలిగించలేకపోతారు. దీంతో సూక్ష్మాతి కేన్సర్ కణాలను కూడా తొలగించే దిశగా సాగిన ప్రయోగాల్లో తేలు విషం ఉపయోగపడుతుందని గుర్తించారు పరిశోధకులు. అలా ఆ తేలు విషంలో ఉండే..పెప్టైడ్ అనే క్లోరోటాక్సిన్ మెదడు కణితిని కణాలతో బంధిస్తుందని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.
ఆ డ్రగ్ అతి చిన్న కేన్సర్ సముహాలను కూడా సమర్థవంతంగా నిర్మూలించగలదు. ఈ ప్రకృతే ప్రాణాంతకమైన వాటిని ఇస్తూ దాన్నుంచే ప్రాణాలు పోసే ఆవిష్కరణలు చేసేలా పరిష్కారాన్ని అందిస్తోంది. సమస్యలోనే పరిష్కారం ఉంటుందనే అద్భుతమైన విషయ్నాని అందించింది. ఈ భూమిపై అన్ని జాతుల మనుగడే సమర్థవంతమైన పర్యావరణానికి కీలకం. అదే మానువ మనుగడకు మూలధారం కూడా.
(చదవండి: Preetisheel Singh Dsouz: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్‌బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!)
Comments
Please login to add a commentAdd a comment