వేడినీటి స్నానం ఎక్సర్‌సైజుతో సమానం!
వేడినీటి స్నానం ఎక్సర్‌సైజుతో సమానం!
Published Mon, Jul 25 2016 11:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
లండన్: రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే వేడి నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అలసట నుంచి శరీరం, ఒత్తిడి నుంచి మనసు ఉపశమనం పొందుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ వేడినీటితో స్నాన్నం.. చిన్నపాటి ఎక్సర్‌సైజుతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని, రక్తపోటు, మధుమేహం వంటివి కూడా తగ్గుతాయంటున్నారు.
2,300 మందిపై పరిశోధన చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. పరిశోధన కోసం ఎంపికచేసిన వారితో 30 నిమిషాలు బ్రిస్క్‌వాక్ చేయించారు. దీంతో వారిలో 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. ఆ తర్వాత వేడినీటితో సంపూర్ణ స్నానం చేయమన్నారు. ఈసారి కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అంటే ఓ వేడి నీటి స్నానం.. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్‌తో సమానమని తేల్చారు. అయితే అరగంట సైక్లింగ్ చేస్తే 630 కేలరీలు ఖర్చవుతాయని, వేడి నీటి స్నానంతో ఇంత పెద్దమొత్తంలో కేలరీలు ఖర్చు కాలేవని గుర్తించారు.
Advertisement