heat water
-
నిద్ర లేవలేదని.. పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి!
సంగారెడ్డి: నిద్రలేవలేదనే కారణంతో ఇద్దరు చిన్నారులపై ఓ తల్లి వేడినీటిని గుమ్మరించింది. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ కథనం ప్రకారం.. ఎల్కపల్లికి చెందిన ఎంచర్ల సంతోష, సాయిలు దంపతులకు ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య కొన్ని నెలలుగా వివాదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేవలేదనే కారణంతో చిన్నారులు శ్రీనిధి, రిత్విక్లపై మరిగేనీటిని పోసింది. ఈ ఘటనలో పొట్ట, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రిత్విక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పగిడేరులో పాతాళగంగ..!
మణుగూరురూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని పరిసర గ్రామాల్లో వస్తున్న వేడి జలపాతాలు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. సింగరేణి బొగ్గు నిక్షేపాల కోసం వేస్తున్న జియోలజికల్ సర్వే బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటంతో ఆ నీరు వృథాగా పోకుండా గ్రామాల రైతులు వ్యవసాయానికి సాగు చేసుకుంటున్నారు. పగిడేరు గ్రామంలో గతంలో కేవలం వర్షాధారంతో ఆ ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటల్లో నీటితో కేవలం వర్షాకాలం పంట పండించాలంటేనే కష్టంగా ఉండేది. సింగరేణి సంస్థ బొగ్గు నిక్షేపాలను కనుగొనడానికి వేస్తున్న బోర్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తుండటం విశేషం. పట్టుకుంటే కాలిపోయే విధంగా నీరు రావడం మరో విశేషం. ఎటువంటి ఖర్చులేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు పగిడేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 20 బోర్లు వేయగా అందులో కనీసం 10 బోర్ల నుంచి వేడి నీరు వస్తుంది. తొలుత స్పీడుగా నీరు వచ్చిన బోర్లు కొంతకాలం తరువాత తగ్గుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం వేసిన బోర్లు ఇంకిపోగా, ఇటీవల వేసిన బోర్ల నుంచి వేడినీరు ఉబికి వస్తుండటంతో రైతులు ఆనందాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల కొడిశల కుంట గ్రామ సమీపంలో వేసిన రెండు బోర్లలో వేడినీరు ఉబికి వస్తుంది. 5 హెచ్‌పీ మోటార్‌కు వచ్చినంత వేగంగా నీరు బయటకు రావడంతో ఆ నీటిని రైతులు చేరువులోకి మళ్లించి పంటలు సాగుచేసుకుంటున్నారు. అదే విధంగా గొల్లకొత్తూరు గ్రామంలో బోరు వేయడంతో దాని నుంచి వేడి నీరు రావడంతో రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో పగిడేరు పరిసర ప్రాం తాల్లో కేవలం ఈ బోర్లను ఆధారంగా చేసుకొని సుమారు 500ల ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నారు. ఈబోర్ల వలన రెండు పంటలు పండటానికి అనుకూలంగా ఉండటంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఖర్చులు లేకుండా సాగునీరు అందిస్తున్న బోర్లు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
వేడినీటి స్నానం ఎక్సర్‌సైజుతో సమానం!
లండన్: రోజంతా పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే వేడి నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అలసట నుంచి శరీరం, ఒత్తిడి నుంచి మనసు ఉపశమనం పొందుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ వేడినీటితో స్నాన్నం.. చిన్నపాటి ఎక్సర్‌సైజుతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ప్రతిరోజూ వేడినీటితో స్నానం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటామని, రక్తపోటు, మధుమేహం వంటివి కూడా తగ్గుతాయంటున్నారు. 2,300 మందిపై పరిశోధన చేసి ఈ నిర్ణయానికి వచ్చారు. పరిశోధన కోసం ఎంపికచేసిన వారితో 30 నిమిషాలు బ్రిస్క్‌వాక్ చేయించారు. దీంతో వారిలో 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. ఆ తర్వాత వేడినీటితో సంపూర్ణ స్నానం చేయమన్నారు. ఈసారి కూడా 140 కేలరీలు ఖర్చయినట్లు గుర్తించారు. అంటే ఓ వేడి నీటి స్నానం.. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్‌తో సమానమని తేల్చారు. అయితే అరగంట సైక్లింగ్ చేస్తే 630 కేలరీలు ఖర్చవుతాయని, వేడి నీటి స్నానంతో ఇంత పెద్దమొత్తంలో కేలరీలు ఖర్చు కాలేవని గుర్తించారు.