ఈ బామ్మ ఫిట్‌నెస్ విషయంలో అందరికీ స్ఫూర్తి. ఈ ఏజ్‌లోనూ ఎంతో చలాకీగా వ్యాయామాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. రెస్ట్ తీసుకునే వయసులో తనకు వీలైన విధంగా సింపుల్ వ్యాయామాలు చేస్తున్నారు. అదికూడా ఏ రోజు స్కిప్ చేయకుండా చేస్తుందట. ఫిటనెస్ పట్ల ఆమె కనబరుస్తున్న నిబద్ధతకు సలాం కొట్టకుండా ఉండలేరు. వృద్ధాప్యంలోనూ మంచి ఫిట్‌నెస్‌తో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?. ఈ బామ్మలా చలాకీగా వ్యాయమాలు చేయాలంటే..
ఫిట్‌నెస్‌కి నిజమైన స్ఫూర్తి 90 ఏళ్ల జే. ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వ్యాయామాలు చేస్తుంది. చాలా చురుకుగా తన దినచర్యను పూర్తిచేస్తుంటుంది. జే 30 స్క్వాట్‌లు (సపోర్ట్ కోసం ఫ్రిజ్‌ని పట్టుకుని మరీ..) 25 సిట్-అప్‌లు, 30-సెకండ్ ప్లాంక్ , పదివేల అడుగులు నడవడం తదితరాలన్నింటిని చేస్తుంది.
మాములుగా అయితే ఎవ్వరైనా ఓ రెండు, మూడు రోజులు చేసి వదిలేస్తారు. కానీ ఈ బామ్మ అలాకాదు. ప్రతిరోజూ చక్కగా వ్యాయామాలు చేస్తుంది. ఇలా ఫిట్‌గా ఉండేందుకు వర్కౌట్‌లు చేయడం ముఖ్యం అని చేతల్లో చూపించింది జెనీ బామ్మ.
వృద్ధాప్యంలో కూడా జే బామ్మలానే చక్కగా వీలైనన్నీ వ్యాయామాలు చేస్తే అనారోగ్యం బారిన పడరు, పైగా హాయిగా చివరి రోజులు సాగిపోతాయి. ఈ సందర్భంగా వృద్ధులు ఈజీగా వేయగలిగే సింపుల్ వ్యాయామాలను చూద్దామా..!.
చైర్ స్క్వాట్‌లు: కాలు కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్యతకు స్క్వాట్‌లు మంచివి. ఇవి లేచి నిలబడి, కూర్చీలోంచి నెమ్మదిగా కూర్చవడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి ఉండదు. పైగా సులభంగా చేయగలుగుతారు.
వాల్ పుష్-అప్స్: ఇవి ఎగువ శరీర బలాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వృద్ధులు నేలకు బదులు గోడను ఆసరా చేసుకుని చెయ్యొచ్చు.
కూర్చునే మార్చింగ్: కూర్చీలో కూర్చొని ఆర్మీ మాదిరిగా మార్చింగ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపరడటమే గాక కాలు కండరాలు బలోపేతమవుతాయి.
లైట్ వెయిట్స్‌తో ఆర్మ్ రైజ్‌లు: భుజం ఎత్తుకు చేతులు ఎత్తడం వల్ల భుజాల పైభాగంలో ఉన్న కండరాలు బలపడతాయి.
చీలమండల భ్రమణాలు: కూర్చీలో కూర్చొని మడమలను ముందుకు వెనుకకు సవ్య-అపసవ్య దిశల్లో తిప్పడం వల్ల కాళ్లో చక్కటి రక్తప్రసరణ జరిగి.. అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నడక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
(చదవండి: ట్రంప్ గెలుపుతో ఊపందుకున్న ఫోర్ బీ ఉద్యమం..!భగ్గుమంటున్న మహిళలు)
Comments
Please login to add a commentAdd a comment