
కూరగాయలతో కాంతి
బ్యూటిప్స్
క్యాబేజీ ఆకులను గుజ్జులా చేసి, అందులో బాదం నూనె కొద్దిగా కలపాలి. ఈ మిశ్రమాన్ని దేహానికి పట్టించి, మృదువుగా రుద్ది, ఆ తర్వాత శుభ్రపరచాలి.కీరా ముక్కలను మెత్తగా రుబ్బి, అందులో కొద్దిగా పంచదార, కొబ్బరినూనె కలిపి శరీరానికి పట్టించి మృదువుగా రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి. టొమాటో గుజ్జులో కొద్దిగా తేనె కలిపి శరీరానికి పట్టించి, రుద్దాలి. తర్వాత స్నానం చేయాలి.