బీజేపీ ఎమ్మెల్యేకి బురద స్నానం చేయించిన మహిళలు | Mud Bath To BJP MLA Jai Mangal Kanojia To Please The Rain God | Sakshi
Sakshi News home page

వర్షం కురవాలని... బురద స్నానం చేసిన బీజేపీ ఎమ్మెల్యే!

Published Wed, Jul 13 2022 9:31 PM | Last Updated on Thu, Jul 14 2022 7:08 PM

Mud Bath To BJP MLA Jai Mangal Kanojia To Please The Rain God - Sakshi

వర్షాల కోసం పూజలు చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలు. వాన దేవుడు కరుణించాలంటే ఒక వ్యక్తి బురద స్నానం చేస్తే ఇంద్రుడు కరుణించి వర్షంతో ఆశీర్వదిస్తాడని నమ్మకం.

Women soak BJP MLA in mud: తెలుగు రాష్ట్రాలు కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతుంటే ఉత్తరప్రదేశ్‌లో వర్షం కురవాలంటూ వింతవింత పూజలు చేస్తున్నారు. వాన దేవడుని ప్రసన్నం చేసుకోవడం కోసం యూపీలోని మహారాజ్‌గంజ్ నివాసితుల బురద స్నానం చేస్తారట. ఇది వారి  పురాతన ఆచారం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. వర్షం రాక కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే యూపీలోని పిప్రదేయోరా మహిళలు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్ కనోజియాకు, మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కృష్ణ గోపాల్ జైస్వాల్‌లకు బురద స్నానం చేయించారు.

ఇలా చేస్తే వాన దేవుడు ఇంద్రుడు సంతోషించి పట్టణాన్ని వర్షంతో ఆశీర్వదిస్తాడని వారి నమ్మకం. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే జై మంగళ్‌ కనోజా మాట్లాడుతూ...ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఈ పూజలో పాల్గొన్నానని చెప్పారు. ఈ వాతావరణంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఇది పాత నమ్మకం పైన ఆధారపడిన ఆచారం కాబట్టి ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చారు. 

(చదవండి: పాక్‌ జర్నలిస్ట్‌ ఆరోపణలు.. స్పందించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement