సాక్షి, మన్యం: సాలరు మండలం కర్మరాజుపేట గ్రామంలో వరదపాయసం ముగియగానే ఆదివారం వర్షం కురిసింది. గడిచిన నెల రోజులుగా వర్షాలు కురవక పంటలు ఎండిపోతుండడంతో వారి ఆచారం ప్రకారం స్థానిక ఆరిలోవ కొండ వద్ద కొండజాకరమ్మ వారికి వరదపాశం గ్రామస్తులు చేశారు. గ్రామంలో ఊరి జన్నతను జోగిదండి, సామాన్లు సేకరిం ఉదయం పది గంటలకు గ్రామస్తులంతా కొండ వద్దకు చేరుకున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. గ్రామస్తులంతా తలా పిడికెడు బియ్యం వేయగా, జన్నతను పాయసం తయారు చేశారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం కొండపై చాపరాయి మీద పాయసం వేసి మోకాళ్లపై కూర్చొని అమ్మవారికి మొక్కుతూ ఆచారం ప్రకారం నాలుకతో పాయసాన్ని స్వీకరించారు. గ్రామస్తులు ఎవరింటికి వారు వెళ్లిన తరువాత వర్షం పడింది. అమ్మవారు అనుగ్రహించి వర్షం కురిపించిందని వారంతా సంబరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment