నిర్మల్: దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ఎక్కడైతే చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడాడో.. అక్కడి మట్టితోనే మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. తనతోపాటు వెయ్యిమంది ప్రాణాలను అర్పించిన స్థలంలోని మట్టితో రాంజీగోండు విగ్రహానికి పోలీస్ భీమేశ్ అనే యువకుడు ప్రాణం పోశాడు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేటకు చెందిన
భీమేశ్ సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1860లో వెయ్యి ఉరులమర్రి ఘటనలో ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు మట్టి ప్రతిమను తయారు చేశారు. ఇందుకు ఎక్కడైతే వారిని ఉరితీశారో.. ఆ మట్టినే ఉపయోగించారు. ఈ సందర్భంగా భీమేశ్ మాట్లాడుతూ నిర్మల్ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘సాక్షి’విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవల చేస్తున్న కార్యక్రమాల స్ఫూర్తితోనే తాను రాంజీ బొమ్మకు ప్రాణం పోసినట్లు భీమేశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment