అమెరికాలోని నెవాడా స్టేట్‌లో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ సాంస్కృతిక సంబరాన్ని తిలకించేందుకు 70 వేల మంది హాజరయ్యారు. అయితే వారంతా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఉత్సవం దక్షిణ నెవాడాలోని ఒక ఇసుక ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఉత్సవ సమయంలో ఇలాంటి విపరత్కర పరిస్థితులు ఏర్పడతాయని ఎవరూ ఊహించలేదు. రెండు మూడు రోజులుగా ఇక్కడ కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో ఉత్సవం జరుగుతున్న ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. నడిచేందుకు కూడా వీలు లేనివిధంగా రోడ్లు తయారయ్యాయి. చివరికి టాయిలెట్లు కూడా ఉపయోగించలేని విధంగా మారిపోయాయి. ఈ ఫెస్టివల్‌కు ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, బిలియనీర్లు హాజరయ్యారు.
ప్రకృతి వైపరీత్య వాతావరణం కారణంగా ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు సమాచారం. నిర్వాహకులు ఇప్పటికే ఉత్సవాన్ని నిలిపివేశారు. అలాగే ఇక్కడికి కొత్తగా వాహనాల రాకను నియంత్రించారు. కాగా 2018లోనూ ఈ ఉత్సవంలో ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. ఆ తరువాత రెండేళ్లపాటు కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను నిర్వహించలేదు.
ప్రస్తుతం ఉత్సవం జరుగుతున్న ప్రాంతంలో భారీగా వర్షపాతం నమోదవుతోంది. అమెరికా ల్యాండ్ మేనేజిమెంట్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అత్యధికంగా బురద పేరుకుపోయిన కారణంగా వాహనాలు రాకపోకలకు సురక్షితం కాదు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయనే సూచనలు ఉన్నందున ఇక్కడ ఉన్నవారంతా ఆహారాన్ని, తాగునీటిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది.
Looks like God is not down with all the hedonism at Burning Man...#WeWantAnswers #BurningMan #BurningMan2023 #Satanic #SatanicAgenda pic.twitter.com/0knj4thwMW
— Isaac’s Army (@ReturnOfKappy) September 4, 2023
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు సంబంధించిన సమాచారం తమకు అందిందని, వైట్‌హౌస్ అధికారులు అప్రమత్తమై, సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు తుపాను కారణంగా ఫెస్టివల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నెవాడాలోని బ్లాక్ రాక్ సిటీలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా బర్నింగ్ మ్యాన్ పండుగ 1990లలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఇక్కడికి 80 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత 1993 సంవత్సరంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య 1000కి పైగా పెరిగింది.ఈ సంఖ్య ప్రస్తుతం 70 వేలకు చేరుకుంది. అమెరికాలో అత్యధిక సెలవులు వచ్చే రోజుల్లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉంటూ సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినవారు తాము రూపొందించిన కళాఖండాలను ప్రదర్శిస్తారు. అలాగే వారు రూపొందించిన వస్తువులను వారే తగులబెడతారు. తద్వారా వ్యక్తిలోని అహం అంతమవుతుందని నమ్ముతారు. అందుకే ఈ ఉత్సవానికి బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అనే పేరు వచ్చింది.
ఇది కూడా చదవండి: బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి?
Burning Man is a mess. Upward of 60,000 people are literally stuck in mud and have been ordered to stay put.
— Citizen Free Press (@CitizenFreePres) September 2, 2023
Food and water running low. pic.twitter.com/HKRZSwkTCY
Comments
Please login to add a commentAdd a comment