మండల కేంద్రం శివారులోని సీఎంసీ కళాశాలలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శారు.
డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : మండల కేంద్రం శివారులోని సీఎంసీ కళాశాలలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శారు. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్‌ను ఇక్కడే నిర్వహించనున్నారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. గంట ముందుగానే పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాలులోకి చేరుకోవాల్సి ఉంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసిన స్ట్రాంగ్ గదులను తెరచి ఈవీఎంలను కౌంటింగ్ హాలులోకి తెస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఏజెంట్లు తెల్లపేపర్, పెన్సిల్ మాత్రమే కౌంటింగ్ హాలులోకి తీసుకొచ్చే అవకాశముంది. అధికారులు జారీ చేసిన పాసులున్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతిస్తారు.
కౌంటింగ్ సమయంలో బయటకు వెళ్తే అంతే సంగతులు. తిరిగి లోనికి అనుమతించరు. ఏజెంట్లకు తాగునీటి వసతి మాత్రమే కల్పిస్తారు. భోజన ఏర్పాటు లేదు. కేంద్రం వద్ద 100 గజాల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉంది. 16 నుంచి 18 వరకు రౌండ్లు ఉంటాయి. 18 గదుల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో రిటర్నింగ్ అధికారులతో సహా సుమారు వేయి మంది సిబ్బంది పాల్గొంటారు. ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపున ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లోనికి వెళ్లాలి. సుమారు వేయి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాకు చెందిన పోలీసులతోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. ప్రత్యేకంగా మీడియా సెల్‌ను ఏర్పాటు చేశారు. మూడు టేబుళ్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. పరిశీలకులు తమ చాంబర్‌లో కూర్చునే కౌంటింగ్ ప్రక్రియను తిలకించవచ్చు. రౌండ్ల వారీగా ఫలితాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.