ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న కెనడా.. తన బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెరపైకి తీసుకొచ్చి భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా పోలీసులు సంచలన ఆరోపలు చేశారు. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. కమ్యూనిటీ ముఖ్యంగా ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
నిజ్జర్ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సోమవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టె గౌవిన్ మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు.
వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో మా భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి బిష్ణోయ్ గ్రూప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం’’ అని గౌవిన్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు ఒట్టావా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదు.
#WATCH | Ottawa, Ontario (Canada): "It (India) is targeting South Asian community but they are specifically targeting pro-Khalistani elements in Canada...What we have seen is, from an RCMP perspective, they use organised crime elements. It has been publically attributed and… pic.twitter.com/KYKQVSx7Ju
— ANI (@ANI) October 14, 2024
అయితే, కెనడా ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఆ దేశ అధికారులు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్యతో ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్తల్లో నిలిచింది. ఈ పరిణామాల వేళ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment