కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. జిల్లాలోని 9 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోకవర్గాలకు సంబంధిం చిన ఈవీఎంలను డిచ్‌పల్లి సీఎంసీ కళాశాల భవనంలో భద్రపరిచిన విషయం తెలిసిందే. ఇక్కడే కౌంటింగ్ నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి కలెక్టర్ సీఎంసీ కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ.. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గంట ముందుగానే పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్‌లోకి చేరుకోవాలన్నారు.
అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే సీల్ వేసిన స్ట్రాంగ్ గదులను తెరచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌లోకి తీసుకువస్తారన్నారు. ఏజెంట్లుతమ వెంట తెల్లపేపర్, పెన్సిల్ తప్ప ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సూచించారు. ఏజెంట్లకు పాస్‌లు తప్పని సరని, పాస్ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ సమయంలో బయటకు వెళ్లే ఏజెంట్లను తిరిగి లోనికి అనుమతించ బోమన్నారు. కౌంటింగ్ హాల్‌లోకి ముందు అధికారులు, తర్వాతే పోలింగ్ ఏజెంట్లను అనుమతిస్తామని తెలిపారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లకు తాగునీటి వసతి మాత్రమే కల్పిస్తామని, భోజన వసతి కల్పించడం లేదన్నారు.
ఈ విషయాన్ని అభ్యర్థులు, ఏజెంట్లు గమనించి అధికారులకు సహకరించాలని సూచించారు. కౌంటింగ్ జరిగే కేంద్రం వద్ద 100 గజాల దూరం వరకు 144 సెక్షన్ అమలులో ఉం టుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నియమ,నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం కౌంటింగ్ జరుగుతుందని, 16నుంచి 18 వరకు రౌండ్లు ఉంటాయన్నారు. 18 గదుల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ, ఎంపీ కౌం టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌లో వేయి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. కౌంటింగ్‌కు హాజ రయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లో నికి వెళ్లాలనిసూచించారు. అభ్యర్థులు, ఏజెం ట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లుతెలిపారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనాలు నిలుపాలన్నారు.