
సాక్షి, న్యూఢిల్లీ : రేల్వేవినియోగదారుల కోసం ఇటీవల అనేక సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్న ఇండియన్ రైల్వే తాజాగా మరో తీపి కబురు అందించింది. తన టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ)అధీకృత టికెటింగ్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే విషయంలో సరికొత్త విధానాన్ని పరిచయం చేసింది. అంటే ఇకపై రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓటీపీ ఆధారంగా వెంటనే,సంబంధిత నగదును ఖాతాదారుని అకౌంట్లో జమ చేయనుంది. ఐఆర్‌సీటీసీ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిందని రైల్వే శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇ-టిక్కెట్ల విషయంలో పారదర్శకత , యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థను తీసుకురావడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది.
టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా ఈ విధానంలో ప్రయాణికుల రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎస్‌ఎంఎస్ రూపంలో ఈ ఓటీపీ వస్తుంది. దీంతో పాటు రిఫండ్ అమౌంట్ వివరాలు కూడా వస్తాయి. అది ఏజెంట్లకు చూపిస్తే వెంటనే డబ్బు వాపస్ ఇచ్చేస్తారు. అయితే ఈ సిస్టమ్ ఐఆర్‌సీటీసీ అధికారిక ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరి ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
టికెట్ డబ్బులు రిటన్ పొందాలంటే..
ఇ-టికెట్లకు మాత్రమే ఓటీపీ రిఫండ్ రూల్స్ వర్తిస్తాయనే విషయాన్ని గమనార్హం.
సరైన మొబైల్ నంబర్‌ను ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్‌కు వినియోగదారుడు అందించాలి.
బుకింగ్ సమయంలో ఏజెంట్లు సంబంధిత నంబరును సరిగ్గా రికార్డ్ చేశారో లేదు చెక్ చేసుకోవాలి.
ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎంత రిఫండ్ వస్తుందో వెంటనే తెలిసి పోతుందని రైల్వే శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment