ఎల్‌ఐసీ ఆనంద మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ | LIC launches mobile app for agents | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ ఆనంద మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

Published Thu, Aug 26 2021 3:58 AM | Last Updated on Thu, Aug 26 2021 3:58 AM

LIC launches mobile app for agents - Sakshi

ముంబై: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్‌ ఏజెంట్‌ న్యూ బిజినెస్‌ డిజిటల్‌ అప్లికేషన్‌ (ఆనంద) పేరుతో మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్‌పర్సన్‌ ఎంఆర్‌ కుమార్‌ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్‌ ద్వారా ద్వారా డిజిటల్‌గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్‌ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్‌ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్‌ కుమార్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement