ANANDA
-
ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం: నటుడు ఆనంద చక్రపాణి
‘‘ఒక నటుడికి తాను సంపాదించే డబ్బు ముఖ్యం కాదు. జనాలు గుర్తుపట్టి పలకరించినప్పుడు, నటించిన సినిమాల్లోని పాత్రల పేరుతో పిలిచినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ప్రేక్షకుల గుర్తింపే పెద్ద అవార్డుతో సమానం’’ అని నటుడు ఆనంద చక్రపాణి అన్నారు. ‘దాసి’ (1988) సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు ఆనంద చక్రపాణి. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వ్యాపారం వైపు వెళ్లిన ఆయన ‘మల్లేశం’ (2019) సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ని ్రపారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆనంద చక్రపాణి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.⇒ నా తొలి చిత్రం ‘దాసి’. ఆ తర్వాత ఐదారు సినిమాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. పైగా కొత్త అవకాశాలేవీ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. దీంతో ఇండస్ట్రీని వదిలి అడ్వర్టైజింగ్ ఫీల్డ్కి వెళ్లి, కొన్ని యాడ్ ఫిలింస్‌కి స్క్రిప్ట్ రాయడంతో పాటు దర్శకత్వం వహించాను. ‘మల్లేశం’ సినిమాకు ప్రోడక్షన్ డిజైనర్‌గా చేసిన లక్ష్మణ్ యేలేగారి ద్వారా ఆ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. అందులో హీరో ప్రియదర్శి తండ్రి పాత్ర చేశాను.నా పాత్రకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా నటన సినీ ప్రముఖులను, సినీ విమర్శకులను, సాధారణ ప్రేక్షకుడిని సైతం భావోద్వేగానికి గురి చేసింది. నా కెరీర్‌కి ఆ మూవీ ఓ మలుపులా ఉపయోగపడింది. నా జీవితం ‘మల్లేశం’కు ముందు.. ‘మలేశం’కు తర్వాత అని చెప్పుకోవాలి. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాత రాజ్ రాచకొండకు రుణపడి ఉంటా. ⇒‘మల్లేశం’ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్, అనగనగా ఓ అతిథి, విరాట పర్వం, లవ్ స్టోరీ, నాంది, వకీల్ సాబ్, టైగర్ నాగేశ్వరరావు... ఇలా దాదాపు 45 సినిమాల్లో నటించాను. ‘గెటప్’ శీను హీరోగా నటించిన ‘రాజు యాదవ్’ చిత్రం మే 24న విడుదలైంది. ఈ సినిమాలో హీరో తండ్రిగా ట్యాక్సీ డ్రైవర్ రాములు పాత్ర చేశాను. ఇందులోని భావోద్వేగ సన్నివేశాల్లో నా నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. నా కెరీర్లో ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి, రాజు యాదవ్’ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ‘మల్లేశం, అనగనగా ఓ అతిథి’ చిత్రాలకు మించిన గుర్తింపు ‘రాజు యాదవ్’తో వచ్చింది. ⇒ ఒకే తరహా పాత్రలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ‘ఆనంద చక్రపాణి మంచి నటుడు. ఏ పాత్రకి అయినా న్యాయం చేయగలడు’ అని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి అనిపించుకోవాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నాను. ‘షష్టి పూర్తి’ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌గారి ఫ్రెండ్‌గా నటిస్తున్నాను. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’తో పాటు ‘గాంధీ తాత చెట్టు, ఉరుకు పటేలా’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో నా పాత్రకి ఎంతో ్రపాధాన్యం ఉంటుంది. అదే విధంగా మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
జూబ్లీహిల్స్ : అక్షర ఆనంద్ ఆధ్వర్యంలో వైట్ నైట్ థీమ్‌తో వేడుక (ఫొటోలు)
-
బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్ సీవీ ఆనంద బోస్(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు గురువారం ఆనంద బోస్ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ పేరిట విడుదలైన సర్క్యులర్ వెల్లడించింది. గతంలో బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్ గణేశన్, బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్‌లాల్ నెహ్రూ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్‌గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా. -
ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్ ఆవిష్కరణ
ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ ఏంజెట్లు, మధ్యవర్తుల కోసం ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్ (ఆనంద) పేరుతో మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కంపెనీ చైర్పర్సన్ ఎంఆర్ కుమార్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా ద్వారా డిజిటల్‌గా కేవైసీ పక్రియను పూర్తి చేయవచ్చు. కాగితం అవసరం లేకుండా పాలసీలను డిజిటల్ రూపంలో మంజూరు చేయవచ్చు. ఏజెంట్ ఇంటికి రావల్సిన పనిలేకుండానే కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవచ్చని ఎంఆర్ కుమార్ తెలిపారు. -
’ఆనందో’ఖర్మ!
మృత్యుద్వారం పునఃప్రారంభం! మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు అనుమతి ప్రారంభమైన పనులు ఇక కార్యకలాపాల మొదలే తరువాయి నిండా 30 ఏళ్లు నిండని యువకులను బలిగొన్న ఆ మృత్యుద్వారం తెరుచుకోబోతుందా..! దీనికి Ðసర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందా..! అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. మొగల్తూరు ఆనంద ఫ్యాక్టరీలో దుర్ఘటన జరిగి ఐదునెలలు గడవకముందే అందులో భద్రతా చర్యలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం చేపట్టే పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం, మొఘల్తూరు : అసలేం జరిగింది...! ఈ ఏడాది మార్చి 30న నరసాపురం తీరప్రాంతం గజగజ వణికిపోయింది. మొగల్తూరు మండలం నల్లవారితోటలోని ఆనంద రొయ్యల ఫ్యాక్టరీలో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేస్తుండగా అందులో విడుదలైన విషవాయువుకు ఐదుగురు యువకులు బలయ్యారు. మృత్యుఒడికి చేరారు. ప్రమాదంలో నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు(22). మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్(30), నల్లంవారితోటకు చెందిన నల్లం ఏడుకొండలు(22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెటి ప్రవీణ్(23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు(22) ప్రాణాలు విడిచారు. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఫ్యాక్టరీ యజమానులపై చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్టరీ కార్యకలాపాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలతో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలతోపాటుగా ప్రజలు, రైతులు, మత్స్యకారులు ఇలా.. అంతా ఏకమై నినదించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకంపనలు పుట్టించింది. ఫ్యాక్టరీ తెరిచేందుకు సన్నాహాలు ప్రమాదం జరిగి ఐదునెలలు కూడా ఇంకా పూర్తి కాకుండానే ఫ్యాక్టరీ తెరిచే సన్నాహాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీ యజమాన్యం భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఫ్యాక్టరీని తిరిగి తెరిపించేందుకు అనుమతులు ఇచ్చింది. ఫ్యాక్టరీలో భద్రతా చర్యలకు సంబంధించిన పనులు చేపట్టడానికి కలెక్టర్ కాటంనేని భాస్కర్ అనుమతి ఇచ్చారు. దీంతో శనివారం ఫ్యాక్టరీ యాజమాన్యం మొదటి దశగా మరమ్మతులు చేపట్టింది. ఇక రెండో దశలో ఫ్యాక్టరీ వ్యవహారాలు పునప్రారంభించడమే తరువాయి. ఇది లాంఛనమేనని వచ్చే నెలలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఘోరం జరిగినప్పుడు హడావుడి తుందుర్రు ఆక్వా ఫుడ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ.. ఆ ప్రాంతం ప్రజలు ఆందోళన చేస్తున్న క్రమంలో మొగల్తూరు రొయ్యల ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ వెన్నులో చలిపుట్టించింది. ప్రభుత్వం తరపున మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు మొగల్తూరు వచ్చి బాధితులను, ఆందోళనకారులను చల్లబరిచే యత్నంచేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. మంత్రులే దగ్గరుండి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 304 ఏ సెక్షన్ ప్రకారం.. ఫ్యాక్టరీ యజమానులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని అప్పటి ఎస్పీ భాస్కర్‌భూషణ్ ప్రకటించారు. ఈ హడావుడి చూసి కాలుష్య ఫ్యాక్టరీ గ్రామం నుంచి వెళ్లిపోతుందని స్థానికులు సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే.. రోజులు గడిచాయి. దుర్ఘటన జరిగిన రోజు ఒక విధంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాట మార్చారు. అసెంబ్లీలో ఈ అంశంపై అప్పటికి కార్మికశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నిబంధనల మేరకే మొగల్తూరు ఫ్యాక్టరీ పని చేస్తుందని ప్రకటించారు. తుందుర్రు ఫ్యాక్టరీతో సహా ఆనంద ఫ్యాక్టరీకూడా అసలు కాలుష్య కారకమైనది కాదని బుకాయించారు. ఫోరెన్సిక్ నివేదికలోనూ ఐదుగురుప్రాణాలు పోవడానికి అమ్మోనియా గ్యాస్ ప్రభావమే కారణమని తేలినా.. ప్రభుత్వ మొండి వైఖరి మారలేదు. కేవలం ఫ్యాక్టరీ యజమాన్యంలో ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చూపించి చేతులు దులుపుకుంది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీని తెరిచేందుకు అనుమతిస్తోంది. భద్రతపై అనుమానాలు ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ తెరిస్తే కార్మికుల ప్రాణాలు భద్రమేనా అనే అనుమానాలు స్థానికులను వెంటాడుతున్నాయి. భద్రతకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇస్తుందా? పటిష్ట చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గొంతేరుపై మళ్లీ కాలుష్యవల! ఆనంద ఫ్యాక్టరీలో ప్రమాదానికి కారణమైన ట్యాంకు గొట్టాలు నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలిపి ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రమాదం జరిగిన తరువాత వైఎస్సార్ సీపీ జిల్లా నాయకత్వం స్వయంగా ఇక్కడకు వచ్చి మీడియా ముందు బట్టబయలు చేసింది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచీ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో కలుపుతున్నారు. దీంతో డ్రెయిన్ కలుషితమవుతోంది. ఫ్యాక్టరీ మూతపడిన ఈ ఐదు నెలల్లో స్థానికంగా గొంతేరు డ్రెయిన్ నీరు స్వచ్ఛంగా మారడమే కాకుండా మత్స్యసంపద విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీ ప్రారంభమైతే యాజమాన్యానికి మరో అవకాశం లేదు. కచ్చితంగా వ్యర్థాలను మళ్లీ గొంతేరు డ్రెయిన్‌లోనే కలిపాలి. లేదంటే తుందుర్రులో చెబుతన్నట్టు సముద్ర ప్రాంతానికి పైప్లైన్లు లాంటివి వేస్తారా? అసలు ఫ్యాక్టరీ లోపల ఎలాంటి భద్రతా చర్యలు చేపడతారనే దానిపై స్పష్టతలేదు. కమిటీ ఏదీ? మరోవైపు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా కార్మికశాఖను అలంకరించిన జిల్లా నేత పితాని సత్యనారాయణ ఈ ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించారు. మళ్లీ అలాంటి ఊసేలేదు. స్థానికులతో ఇంత వరకూ మాట్లాడిన పాపాన పోలేదు. ఫ్యాక్టరీ చుట్టుప్రక్కల గ్రామాల వారు అంతా ఇక కంపెనీ తెరుచుకోదనే భ్రమలో ఉన్నారు. ఇంత ఘోరం జరిగిన తరువాత కుడా స్థానికులతోనూ, రాజకీయ పక్షాల నేతలు, రైతులతోనూ ఎలాంటి సంప్రదింపులు జరుపకుండా మొగల్తూరు ఫ్యాక్టరీని మొండిగా తెరిపింపించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఎన్నాళ్లు కాపాడతారు
నరసాపురం : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు కూలీల ఉసురు తీసింది విష వాయువులేనని తేలిపోయింది. ఆ ప్లాంట్‌లో మార్చి 30న చోటుచేసుకున్న ఈ ఘోరానికి విద్యుదాఘాతమే కారణమని.. అక్కడి ప్లాంట్ నుంచి ఎలాంటి విష వాయువులు వెలువడలేదని నమ్మించేందుకు ప్లాంట్ యాజమాన్యం, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహా మరికొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిసూ్తనే ఉన్నారు. తద్వారా కేసును పక్కదారి పట్టించి.. యాజమాన్యాన్ని ఒడ్డున పడేయడంతోపాటు తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆక్వా పార్క్ యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో తరచూ ఆక్వా పార్క్‌కు అనుకూల ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. మొగల్తూరు ప్లాంట్‌లో కాలుష్యమే లేదని రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేశారు. కాలుష్యం కళ్లముందే కనబడుతున్నా.. అలాంటిదేమీ లేదని ఇప్పటికీ బొంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం వాస్తవాలను నిగ్గుతేల్చింది. అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులే మరణా లకు కారణమైనట్టు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అయినా.. మౌనముద్రలోనే మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మార్చి 30న ఉదయం నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22), మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (21), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. ఇందుకు కారణమైన ట్యాంక్ నుంచి సుమారు వారం రోజులపాటు విష వాయువుల ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందిన నివేదిక వాస్తవాన్ని వెల్లడి చేయడంతో ఆక్వా ప్లాంట్ యాజమాన్యమే ఇందుకు కారణమని తేలిపోయింది. నరసాపురం ప్రభుత్వాసుపత్రికి మూడు రోజుల క్రితమే ఫోరెన్సిక్ నివేదిక అందగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ దానిని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుకు అందజేశారు. ప్రమాదం జరిగిన రోజున విషవాయువులే ప్రమాదానికి కారణమని.. ఇందులో ఆనంద యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజునుంచి దర్యాప్తును గాలికొదిలేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ నివేదిక అంది మూడురోజులు గడిచినా.. పోలీస్ యంత్రాంగం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అనంతరమే ముందుకు వెళతామని పోలీస్ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగుల్ని బలిపెడతారా! ఐదుగురి ప్రాణాలు హరించిన పాపం నుంచి యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి యాజమాన్యాన్ని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఘటన జరిగిన రోజున మంత్రులు దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అందువల్ల పోస్టుమార్టం నివేదిక తారుమారయ్యే అవకాశం ఉందనే విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కాపలా ఉండిమరీ ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి విష వాయువుల కారణంగానే మొగల్తూరు ఆక్వాప్లాంట్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే విషయం వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా పంతానికి పోకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 40 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాపార్క్‌ను తీరానికి తరలించాలి. ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే మంత్రులూ.. ఇప్పుడేమంటారు ప్రమాదం సాధారణంగా జరిగిందని, అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని అసెంబ్లీలో అప్పటి మంత్రులు బుకాయించారు. ఎంపీ గోకరాజు గంగరాజు అయితే ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏం చెబుతారు. ప్రజల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరిచి వారి ప్రకటనల్ని వెనక్కి తీసుకోవాలి. – శిరిగినీడి నాగభూషణం, నాయకుడు, సర్వోదయ రైతు సంఘం హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి మొగల్తూరు ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ల క్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లే జరిగిందనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేలిపోయింది. అసలు ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని రక్షించాలనుకుంటే అంతకంటే దారుణం ఉండదు. – బి.బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి న్యాయ సలహాతో ముందుకెళ్తాం మొగల్తూరు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందుకు వెళ్తాం. ఐదుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రత్యేకంగా మళ్లీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు చెప్పలేం. – జి.పూర్ణచంద్రరావు, డీఎస్పీ, నరసాపురం -
నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు తీసింది
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు కార్మికుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనంద్ ఆక్వా ఇండస్ట్రీస్ యాజమాన్యం బాధ్యత వహించాలని ప్రముఖ పర్యావరణవేత్త మేథాపాట్కర్ నాయకత్వంలోని జాతీయ ప్రజా ఉద్యమాల సంఘటన (ఎన్ఏపీఎం) నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ, యాజమాన్యాల నేరపూరిత నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను బలి గొన్నదని నిగ్గు తేల్చింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆనంద్ ఆక్వా పరిశ్రమను మూసివేయాలని కోరింది. మొగల్తూరు నల్లంవారితోట గ్రామంలోని ఆనంద ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో విషవాయువులు వెలువడి ఐదుగురు మరణించిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాజిక సేవా కార్యకర్తలు రామకృష్ణంరాజు, మీరా సంఘమిత్ర, విమల, బాబ్జీ, రాజేష్ తదితరులు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి వాస్తవాలను పరిశీలించారు. మే«థాపాట్కర్ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్‌కు చెందిన అరుణ్‌రాయ్, శంకర్‌సింగ్, ప్రఫుల్లా సమాంతర (లోక్‌శక్తి అభియాన్), బినాయక్ సేన్, సందీప్ పాండే, గీతా రామకృష్ణన్, మీరా సంఘమిత్ర సహా 25 మంది సేవా సంస్థల కార్యకర్తల సంతకాలతో కూడిన నిజనిర్ధారణ నివేదికను గురువారం మీడియాకు విడుదల చేశారు. వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. l2012లో నల్లంవారి తోటలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ కాలుష్యంతో ఇప్పటికే పది కుటుంబాలు (మొత్తం ఉన్నదే 60 కుటుంబాలు) గ్రామాన్ని వదిలివెళ్లాయి. కొంతమంది గ్రామస్తులు భూముల్ని అమ్ముకున్నారు. lగ్రామస్తుల ఫిర్యాదు మేరకు నెల క్రితం సబ్ కలెక్టర్ ఈ గ్రామాన్ని సందర్శించి వ్యర్థాల నిర్వహణకు ఒక ట్యాంకును నిర్మించాలి్సందిగా హెచ్చరించి వెళ్లారు. ఇప్పటివరకు ట్యాంకు నిర్మించలేదు. lయాజమాన్యానికి అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇలాంటి 8 ఫ్యాక్టరీలు నిర్వహిస్తోంది. ఈ కారణంగానే సబ్ కలెక్టర్ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యమే ఐదుగురు కార్మికుల్ని బలిగొంది. lఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేయకుండానే గొంతేరు కాలువలోకి వదలడం వల్ల వేలాది మంది జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది. యాజమాన్యం మాత్రం లాభాలను దండుకుంటోంది. డిమాండ్లు ఇవీ lఐదుగురు మృతి ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. lఆనంద్ గ్రూపు నడుపుతున్న సంస్థల్లో కాలుష్య స్థాయిని నిర్ధారించేందుకు పర్యావరణ, విద్యావేత్తలు, సేవా కార్యకర్తలు, న్యాయకోవిదులు, అధికారులతో నిపుణుల కమిటీని నియమించాలి. lగొంతేరు కాలువలోకి వ్యర్థాలు వదలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. lతుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం ఆపేయాలి. -
ప్రాణాలకు వెల.. న్యాయం డీలా..
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విష వాయువులు ఐదుగురు కూలీల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలకు వెల కట్టేసి.. న్యాయానికి పాతరేసేందుకు దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తమవంతు సహాయం అందిస్తున్నారు. మరణాలకు కారణ మైన యాజమాన్యంపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తదితరులు వేలాది ప్రజల సమక్షంలో ప్రకటించినా.. తెరవెనుక మాత్రం వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మనుషుల ప్రాణాలకు డబ్బుతో విలువ కట్టేస్తే సరిపోతుందనుకున్నంత కాలం మొగల్తూరు ఘటన లాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉంటాయి. నల్లంవారి తోటలోని అనంద ఆక్వా ప్లాంట్ ట్యాంక్ నుంచి గతనెల 30న విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాతపడిన విషాద ఘటన విదితమే. ఆ తరువాత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై ఈగ వాలకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆనంద ఆక్వా యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘోర ఘటనకు కారణమని మంత్రులు ప్రకటించినా ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతి లేదు. కనీసం యాజమాన్య ప్రతినిధులను పిలిచి విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుండగా.. మరణాలు విషవాయువుల వల్ల సంభవించలేదని.. విద్యుదాఘాతమే కారణమని ఆక్వా ప్లాంట్ యాజమాన్యం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు ఇదే యాజమాన్యం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్‌కు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మద్దతుగా నిలవడం విశేషం. అన్నీ అతిక్రమణలే.. గొంతేరు కాలువ నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నామని, మొగల్తూరు ఆక్వా ప్లాంట్ గొంతేరులో వదులు తున్న కాలుష్యం వల్ల తామంతా ఇబ్బంది పడుతున్నామ ని 25 గ్రామాల ప్రజలు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ యాజమాన్యం పైప్లైన్ల ద్వారా కాలుష్యాన్ని నేరుగా గొంతేరు కాలువలోకి వదిలిపెడుతోందని ముత్యాలపల్లి, మొగల్తూరు, గరువుపల్లవ పాలెం, గుంటపల్లిపాలెం ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలకు వచ్చింది. ప్లాంట్‌లో అన్నీ అతిక్రమణలే కనిపించాయని నిర్థారించింది. రెండు నెలల్లోగా అతిక్రమణలను యాజ మాన్యం సవరించుకోవాలని స్పష్టం చేసింది. ప్లాంట్‌నుంచి వస్తున్న వ్యర్థాలను గొంతేరు కాలువలో కలుపుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ సభ్యులు గుర్తించారు. ఈ ప్లాంట్ అవసరాలకు రోజుకు 59 వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తామని యాజమాన్యం చెప్పిన్పటికీ.. 1.12 లక్షల లీటర్ల వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నీటి మీటర్లను ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు. రోజుకు 40 వేల లీటర్ల నీరు మాత్రమే బయటకు విడుదల చేస్తున్నట్టు ప్లాంట్ యాజ మాన్యం పేర్కొనగా.. అంతకుమించి వస్తున్నట్టు తనిఖీలలో తేలింది. కేవలం 10 టన్నుల రొయ్యల సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్టు పేర్కొన్న యాజమాన్యం 30 టన్నుల సామర్థ్యంతో దీనిని నిర్మించినట్టు టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. గొంతేరులో కలుస్తున్న రెండు పైపులైన్లను వెంటనే తొలగించాలని అదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో వ్యర్థాలను ప్లాంట్‌నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఎంత సరుకు ప్రాసెస్ చేస్తున్నారనే దానిపై రికార్డులు నిర్వహిం చాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేస్తున్నది, లేనిది రెండు నెలల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని పర్యావరణ ఇంజినీరుకు జనవరి 12న ఆదేశాలిచ్చింది. వ్యర్థాలను, కాలుష్యాన్ని నేరుగా గొంతేరులో కలుపుతున్న పైప్లైన్లను నేటికీ అలాగే ఉంచేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించలేదు. రెండు నెలల తర్వాత తాము ఫ్యాక్టరీని సందర్శించామని, ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఇంతలోనే ఘటన జరిగిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. పర్యావరణ ఇంజినీరు సక్రమంగా తనిఖీ చేసినా వాస్తవాలు బయటపడేవి. ఐదుగురి ప్రాణాలు నిలిచేవి. పర్యావరణ ఇంజినీర్ ఆ పని చేయకపోవడం, జిల్లా అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ముకాయడంతో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ పనులను నిలిపివేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
అనుమతి ఒకటి.. చేసేది వేరొకటి
భీమవరం : మొగల్తూరు నల్లంవారి తోటలో ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఆనంద గ్రూప్ సంస్థల యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడి ప్లాంట్‌లో కేవలం రొయ్య తలలను తొలగించి శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి తీసుకుంది. వీటిని రొయ్యల షెడ్లుగా పిలుస్తారు. రొయ్యల షెడ్లు వేరుగా, ప్రాసెసింగ్ ప్లాంట్లు వేరుగా ఉంటాయి. అయితే, ఆనంద యాజమాన్యం మొగల్తూరు ప్లాంట్ నుంచి రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించకుండా ఇక్కడే ప్రాసెసింగ్ చేయిస్తోంది. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు యంత్రాల సాయంతో ఐస్‌తో కూడిన శ్లాబ్లుగా మార్చి ప్యాకింగ్ సైతం చేయిస్తోంది. వాటిని కోల్డ్ స్టోరేజీలకు తరలించకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుం డానే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సాగుతున్న వ్యవహారమంతా అక్రమమేనని ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. రొయ్యల షెడ్ ముసుగులో ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులను సైతం ఎగవేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం స్వార్థమే ప్రాణాలు తీసింది నల్లంవారి తోటలోని షెడ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రం చేస్తారు. అనంతరం వాటి తలలను తొలగిస్తారు. ఈ సమయంలో రొయ్య తలల నుంచి పసుపు, తెలుపు రంగులతో కూడిన జిగురు లాంటి పదార్థం బయటకొస్తుంది. దానిని ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) లోకి పంపించాలి. ఈటీపీకి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసి.. దానిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. ఈటీపీకి గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సమీపంలోనే ఉన్న జనావాసాల్లోకి దుర్గంధం వెదజల్లుతుంది. దీనివల్ల ప్రజలు ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో ఈటీపీని రేకులతో మూసివేసి దుర్గంధం బయటకు రాకుండా చేశారు. ఈటీపీని మూసివేయడం వల్ల వ్యర్థాలు అందులో కుళ్లిపోయి విషవాయువులు వెలువడ్డాయి. అవే ఐదుగురు కూలీలను పొట్టన పెట్టుకున్నాయి. పన్నులు ఎగ్గొడుతున్న సంస్థకు సర్కారు అండ ఆనంద గ్రూపు సంస్థలు కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మొగల్తూరులోని నల్లంవారి తోటలో రొయ్యల షెడ్ల ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఆ రెండుచోట్లా అక్రమంగా రొయ్యల ప్రాసెసింగ్ నిర్వహిస్తోంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి్సన పన్నులు ఎగ్గొడుతోంది. దీంతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆనంద యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి యాజమాన్యానికి ఆక్వా ఫుడ్‌పార్క్ కేటాయించడం, కోట్లాది రూపాయలను సబ్సిడీగా చెల్లించడం, ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల నివాసాల వద్ద కొనసాగుతున్న పికెట్లు మృత్యువాత పడిన యువకుల ఇళ్లకు సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు సోమవారం కూడా కొనసాగాయి. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చివెళ్లే వారి వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. పోలీస్ పికెట్లు కొనసాగుతుండటంతో మృతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుండగా, నిత్యం కూలీల రాకతో హడావుడిగా ఉండే ఆనంద రొయ్యల ప్లాంట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ఘటన జరిగి ఆరు రోజులైనా విషవాయువులు వెదజల్లిన ట్యాంక్ నుంచి నేటికీ దుర్వాసన వసూ్తనే ఉంది. ఖాకీల నీడలోనే మొగల్తూరు మొగల్తూరు : మొగల్తూరు ఇంకా పోలీసుల నీడలోనే ఉంది. నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని ట్యాంక్ నుంచి విషవాయువులు వెదజల్లి ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజున గ్రామస్తులు ఆందోళనలు, ధర్నాలకు దిగడంతో పోలీసులను మోహరించారు. అక్కడ శాంతిభద్రతలు ఘటన జరిగిన రోజు మధ్యాహ్నానికే అదుపులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు షిప్టుల వారీగా బందోబస్తు కొనసాగిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పరిశ్రమ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ స్టార్స్ ఎక్కడ! మొగల్తూరులు విషవాయువుల కారణంగా ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఉదంతంపై మొగల్తూరు హీరోలు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే రోజు సాయంత్రం వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మూడవ రోజున పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, సీఐటీయూ, సీపీఎం ముఖ్యనాయకులు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు వచ్చారు. తమ సొంత గడ్డపై దారుణ ఘటన చోటుచేసుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి, రెబల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు ఈ ఛాయలకు రాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆక్వా ప్రకంపన
నరసాపురం/మొగల్తూరు : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో పుట్టుకొచ్చిన కాలుష్య భూతం ఐదుగురు యువకుల్ని పొట్టనపెట్టుకుని ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. మరోవైపు ఈ అంశం అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇదిలావుంటే.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. మరోవైపు చిన్నపాటి ప్లాంట్ నుంచి వెలువడిన కాలుష్యమే ఏకంగా ఐదుగుర్ని పొట్టన పెట్టుకుంటే.. తుందుర్రులో నిర్మించే ఆక్వా పార్క్ వల్ల తలెత్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో గుర్తించాలని.. తక్షణమే ఆక్వా పార్క్‌ను సముద్ర తీరానికి తరలించాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకున్నాయి. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకోవైపు మొగల్తూరు ఘటనలో మృతిచెందిన వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కుటుంబాలకు ఆసరాగా నిలిచిన ఐదుగురు యువకుల్ని మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్ పొట్టన పెట్టుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపగా.. అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. గురువారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. గురువారం రాత్రి వీరి మృతదేహాలకు నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం జరిపించి హుటాహుటిన గ్రామాలకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చిమరీ రాత్రికి రాత్రే అంత్యక్రియలు జరిపించారు. మృతుల ఇళ్ల ఇళ్లవద్ద బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఆ ఇళ్ల వద్ద శుక్రవారం హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు, మొగల్తూరు మండలం పోతులవారి మెరకకు చెందిన తోట శ్రీనివాస్‌లకు చంటిబిడ్డలు ఉన్నారు. బొడ్డు రాంబాబు (మెట్టిరేవు), నల్లం ఏడుకొండలు (నల్లంవారి తోట), జక్కంశెట్టి ప్రవీణ్ (కాళీపట్నం)లకు వివాహాలు కాలేదు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల బాధ్యతలు మొత్తం వీరే చూస్తున్నారు. మృతులు ఐదుగురూ తమ కుటుంబాలను వారి భుజాలపై మోస్తున్నవారే. మృతుల కుటుం బాల్లో ఏ ఇంటికి వెళ్లినా వారి రోదనలు, ఆవేదనల్ని చూసి ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. అన్నెంపున్నెం ఎరుగుని వీరంతా.. స్వార్థం కోసం, సంపాదన కోసం పెద్దలు చేసిన ద్రోహానికి బలైపోయారని గ్రామస్తులు నిట్టూరుస్తున్నారు. ఇంటింటా ఇదే చర్చ సముద్రం.. గోదావరి.. పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా ఉండే ఆ గ్రామాల్లోని వాతావరణాన్ని ఆనంద ఆక్వా ప్లాంట్ నిర్లక్ష్యం పూర్తిగా మార్చేసింది. ఐదుగురు యువకుల మృతితో మొగల్తూరు మండలంలో భయానక వాతావరణం నెలకొంది. కొన్ని ఇళ్లలో పొయ్యి కూడా వెలిగించుకోలేదు. అందరిలో ఒకటే భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. విషవాయువు రావడం ఏమిటి, మనుషులు చనిపోవడం ఏమిటనే చర్చ నడుస్తోంది. ఇలాంటి ఘోరం తామెప్పుడూ వినలేదని చెబుతున్నారు. ఎవరిని కదిపినా భవిష్యత్‌లో ఇంకెన్ని చావులు చూడాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇళ్ల మధ్య ఇలాంటి ఫ్యాక్టరీలు పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని ఆవేదన చెందుతున్నారు. ఆనంద ఫ్యాక్టరీనే కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని కాలుష్యకారక ప్లాంట్లను మూసేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల ఇళ్లవద్దా బూట్ల చప్పుళ్లే మొగల్తూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్ల మధ్య భీతావహ వాతావరణం నెలకొంది. గురువా రం నాటి ఘోర ఘటన నేపథ్యంలో మొగల్తూరు పరిసరాల్లో భారీస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ బలగాలు మోహరించాయి. వారి ఇళ్లకు ఎవరినీ రానివ్వడం లేదు. ప్రమాదానికి కారణమైన ఆనంద ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించినా.. గేట్లకు ఎలాంటి సీళ్లు వేయలేదు. గేట్లు మూసేసి, కాపలాగా భారీ బందోబస్తు పెట్టారు. పెనుగొండ సీఐ రామారావు నేతృత్వలో 100 మంది కానిస్టేబుళ్లు ఫ్యాక్టరీ చుట్టూ రక్షణ వలయంగా నిలబడ్డారు. తుందుర్రును మరిపించే విధంగా పోలీస్ బందోబస్తు నల్లంవారి తోటలోనూ కొనసాగుతోంది. ఫ్యాక్టరీకి వెళ్లేదారుల్లోనూ, మండలంలోని ముఖ్యమైన గ్రామాల ప్రధాన కూడళ్లలోనూ పోలీసులు జీప్లను నిలిపి నిఘా ఉంచారు. నిజానికి ప్రమాదం జరిగిన గురువారం సాయంత్రం వరకూ మాత్రమే ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించిన తరువాత అంతా ప్రశాంతంగానే ఉంది. ఆప్తులను కోల్పోయి మృతుల కుటంబాలవారు, ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో ప్రజలు ఆందోళన చెందుతుంటే.. పోలీసుల చర్యలు పచ్చని గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.