'ఏజెంట్ల ప్రమేయం లేకుండా గల్ఫ్‌కు కార్మికులు'
తెలంగాణ హోంశాఖ, కార్మికశాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి
రాయికల్ (కరీంనగర్) : ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం, కార్మికశాఖల మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. హోం మంత్రి నాయిని శుక్రవారం దుబాయిలో మీడియాతో కాసేపు మాట్లాడారు. దుబాయిలోని సోలాపూర్‌లో తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోసియేషన్ ఆధర్యంలో నిర్వహిస్తున్న కార్మికుల కల్చరల్ కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇప్పటినుంచీ ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ పౌండర్ శ్రీనివాసశర్మ, అధ్యక్షుడు జువాడి శ్రీనివాస్, ఉపాధక్షుడు రాజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది.