GULF association
-
భారత్ జోడో యాత్రలో గల్ఫ్ కార్మికుల డిమాండ్లు
తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో మంగళవారం శంషాబాద్ నుంచి బోయినపల్లి మార్గంలో ఆసక్తికర సంఘటన జరిగింది. 'స్టేట్ యాత్రీ' పాసులు కలిగిన ఇద్దరు యువకులు ప్లకార్డులు పట్టుకుని భారత్ జోడో యాత్రలో నడుస్తున్నారు. ఇది గమనించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేత (సీఎల్పీ లీడర్) భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వారిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జేఏసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్నామని అన్నారు. గల్ఫ్ వలస కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన పెరుగు మల్లికార్జున్, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన దీటి నర్సింలు వారికి తెలిపారు. దేశ సమగ్రత కొరకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాత్ర ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పడానికి అడుగులో అడుగువేసి నడుస్తున్నట్లు వివరించారు. డిమాండ్ల సాధనలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధుల నిబద్ధత, పట్టుదల పట్ల ముగ్ధులైన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూరి, కాంగ్రెస్ నాయకులు డా.శ్రవణ్ కుమార్ హైదరాబాద్, బహదూర్ పురలోని లెగసీ ప్యాలస్‌లో ఏర్పాటు చేసిన యాత్రీస్ క్యాంప్ (వసతి శిబిరం)లో ప్లకార్డులను ఆవిష్కరించారు. భారత ప్రభుత్వం రూ.10 లక్షల 'ప్రవాసి భారతీయ బీమా యోజన' పథకాన్ని అన్ని క్యాటగిరీల గల్ఫ్ కార్మికులకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి అనే డిమాండ్లతో ఉన్న మూడు ప్లకార్డులు సహ యాత్రీలను విశేషంగా ఆకర్షించాయి. -
వారిని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో గల్ఫ్‌కార్మికుల సమస్యలను ప్రధాని నరేంద్రమోదీకి సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు తెలియజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గల్ఫ్ వలసకార్మికుల సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా పనిచేస్తున్న 35 పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, విద్యావంతులు కలిసి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్. జై శంకర్‌కి, సహాయ మంత్రి వి. మురళీధర్కి గల్ఫ్ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రం పంపించారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యం, జీవనోపాధి, ఆదాయానికి ముప్పు తెచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో అత్యధిక వలసకార్మికులను పంపే దేశంగా ఉన్న భారతదేశం ఈ విషయంలో ఆందోళన చెందడానికి చాలా కారణాలు ఉన్నాయని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. (గల్ఫ్ ప్రవాసీలకు ‘కరోనా’ హెల్ప్లైన్ల ఏర్పాటు) లాక్ డౌన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన తర్వాత భారత్ లోకి వలసదారులు రావడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల సవాళ్లు ఎదుర్కోవలసి ఉన్నందున తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఆ ప్రకటనలో సూచించారు. ఈ సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, గర్భవతులు, తీవ్రమైన జీవనశైలి వ్యాధులు కలవారు, వృద్ధులు, స్వల్పకాలిక వీసాలపై ఉన్నవారు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వలస కార్మికులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం సదుపాయం కల్పించాలని కోరారు. కార్మికులను స్వదేశానికి రప్పించడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ, ఈ అత్యవసర పరిస్థితిలో వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి ఉచితంగా తీసుకురావాలి లేదా ట్రావెల్ సబ్సిడీ (ప్రయాణ రాయితీ) అయినా ఇవ్వాలని వారు కోరారు. వాపస్ వచ్చిన వారికి వైద్య పరీక్షలు, 'క్వారంటైన్' (నిర్బంధ) సౌకర్యాలు కల్పించడానికి, కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణ ఆర్థిక సహాయం కొరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్ధిక సహాయం ప్రకటించాలన్నారు. (ఎన్నారై పాలసీ రావాలి) అదేవిధంగా భారతీయ రాయబార కార్యాలయాల వారు తక్షణం అన్ని కార్మిక శిబిరాలు (లేబర్ క్యాంపులు) సందర్శించి, సంక్షోభంలో ఉన్న కార్మికుల డేటాను సేకరించి వారికి ఉచిత కొవిడ్-19 పరీక్షలు, ఆహారం, ఆశ్రయం, మనుగడ భత్యం తదితర సహాయం అందించాలి కోరారు. కువైట్ కు 'రాపిడ్ రెస్పాన్స్ టీం' (అత్యవసర సహాయ బృందం) పేరుతో వైద్య బృందాన్ని పంపిన విధంగానే, భారతీయులు ఎక్కువగా ఉన్న దేశాలకు కూడా రాపిడ్ రెస్పాన్స్ టీంను పంపేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. స్థానిక జాబ్ మార్కెట్ (ఉద్యోగ విపణి) లో వీరికి కొంత కోటా కేటాయించాలని, ప్రస్తుతం ఉన్న వన్‌టైమ్ (ఒకేసారి) సహాయ పథకాలకు బదులుగా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పునరావాసం, పునరేకీకరణ కోసం స్థిరమైన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అభ్యర్థించారు. కోవిడ్-19 వంటి మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవడం, ఆరోగ్య ముప్పులను ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) బీమా పథకంలో చేర్చాలి. -
'ఏజెంట్ల ప్రమేయం లేకుండా గల్ఫ్‌కు కార్మికులు'
తెలంగాణ హోంశాఖ, కార్మికశాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి రాయికల్ (కరీంనగర్) : ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం, కార్మికశాఖల మంత్రి నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. హోం మంత్రి నాయిని శుక్రవారం దుబాయిలో మీడియాతో కాసేపు మాట్లాడారు. దుబాయిలోని సోలాపూర్‌లో తెలంగాణ గల్ఫ్ కల్చరల్ అసోసియేషన్ ఆధర్యంలో నిర్వహిస్తున్న కార్మికుల కల్చరల్ కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటినుంచీ ఏజెంట్ల ప్రమేయం లేకుండా కార్మికులను గల్ఫ్ దేశాలు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ పౌండర్ శ్రీనివాసశర్మ, అధ్యక్షుడు జువాడి శ్రీనివాస్, ఉపాధక్షుడు రాజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది.