పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలసజీవుల బతుకు దుర్భరంగా మారింది. ఏజెంట్ల చేతిలో మోసపోయి కొందరు.. వీసా గడువు ముగిసి మరికొందరు ఊచలు లెక్కిస్తున్నారు. ఇంకొందరు ఏళ్లు గడుస్తున్నా జాడలేకుండా పోయారు.
వారు బతికున్నారో లేదో కూడా తెలియదు. గల్ఫ్ దేశాలకు వెళ్లి పదో పరకో పంపిస్తారని ఆశిస్తే అసలుకే మోసం వచ్చిందని బాధితులు విలపిస్తున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, కడసారి చూపునకు నోచుకోక కుమిలిపోతున్నారు. ఆదివారం జగిత్యాలలో జరిగిన గల్ఫ్ గర్జన సదస్సులో పలువురు మహిళలు తమ వారిని తల్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
-న్యూస్‌లైన్, జగిత్యాల
కదిలిస్తే కన్నీళ్లు
Published Mon, Aug 5 2013 3:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement