పంచాయతీ ఎన్నికలను కుట్రలకు వేదికగా చేసుకునేందుకు యత్నిస్తున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి ఏకగ్రీవాలను అడ్డుకోవాలని పథకాలు రచిస్తున్నారు. అనామకులతో నామినేషన్లు వేయించి పోటీ ఖరారు చేయాలని ఎత్తులు వేస్తున్నారు. పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాలను దక్కకుండా చేసేందుకు ఏకగ్రీవాలను అడ్డుకునే మంత్రాంగం నడిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగు తమ్ముళ్లు గ్రామీణాభివృద్ధికి ఆటంకాలు సృష్టించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
సాక్షి, తిరుపతి : జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. అయితే పల్లెలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు భారీ నజరానాను ప్రకటించింది. ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎవరో ఒకరితో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పోటీ చేయాలనుకునేవారు స్థానిక పెద్దలు సమావేశమవుతున్నారు. అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఏకగ్రీవాలు చేసుకునేందుకు చర్చిస్తున్నారు. ఇవి ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో అధిక శాతం పంచాయతీలు ఏకగ్రీవ బాటలో నడిచేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. చదవండి: చంద్రబాబును చూసి జనం ఛీత్కరించుకుంటున్నారు
ఈ సమయంలో టీడీపీ నాయకులు గ్రామీణ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అనేక చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి ఉండడంతో వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పాత పరిచయాలను అడ్డంపెట్టుకుని టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన నాయకులను ప్రలోభపెడుతున్నారు. కనీసం నామినేషన్ వేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల ఖర్చును సైతం మేమే పూర్తిగా పెట్టుకుంటామని ఆశపెడుతున్నారు. ఈ క్రమంలో పలువురు పాత కాపులకు నగదు, మద్యం చేరవేసినట్లు సమాచారం. అలాగే వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసే అ భ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలతో కూడా రాజకీయం చే యాలని పథకాలు రచిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకర్గాల్లో టీడీపీ నేతలు పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే. చదవండి: ఎలక్షన్ ఎక్సర్‌సైజ్ షురూ.. ఏకగ్రీవాలకే మొగ్గు!
Comments
Please login to add a commentAdd a comment