
సాక్షి, విజయవాడ: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనాతో చాలా మంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎన్నికలు వద్దని ఇప్పటికే ఎస్ఈసీకి అనేక సార్లు విన్నవించాం. అయినా మొండిగా షెడ్యూల్ విడుదల చేయడం దారుణం. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు' అని అన్నారు. చదవండి: (సంక్షేమ కార్యక్రమాల అమలు ఆపండి)
ఈ సందర్భంగా టీడీపీ నేత అశోక్‌బాబుకు చంద్రశేఖర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఉద్యోగ సంఘాల్లో పనిచేసి రాజకీయాల్లోకి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు. మీ రాజకీయ పార్టీల సంగతి మీరు చూసుకోండి. మీలాగా రాజకీయ పార్టీలకు మస్కాలు కొట్టడం మాకు చేతకాదు. ఉద్యోగ సంఘాలపై అశోక్ బాబు ఆరోపణలు సిగ్గుచేటు' అంటూ మండిపడ్డారు. చదవండి: (నిమ్మగడ్డ ‘కోడ్’ ముందే కూత)
Comments
Please login to add a commentAdd a comment