సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాసలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పింది. అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.
ఇప్పుడు కరోనా స్ట్రైయిన్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి?. ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?)
వ్యక్తిగత ఆసక్తి మీ స్థాయికి మంచిది కాదు: ఎంపీ మాధవ్
నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్న ఏకపక్షతీరుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. 'ప్రపంచమంతా ఒకవైపు అంటే నేను మాత్రం మరోవైపు అనేవిధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ఆయన వ్యక్తిగత ఆసక్తిని చూపిస్తున్నారు. వ్యక్తిగత ఆసక్తి అనేది మీ స్థాయికి మంచిది కాదు. ప్రభుత్వ యంత్రాంగం కరోనా టీకాను పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిపితే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల విధులు నిర్వహించాల్సి ఉన్నందున కరోనా టీకా పంపిణీకి అంతరాయం కలుగుతుంది. నిమ్మగడ్డ వ్యవహరిస్తోన్నతీరుతో ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లే ప్రమాదముంది' అని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు. చదవండి: (ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో)
టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు: అమరనాథ్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అనుబంధ సభ్యునిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. ఎన్నికల కమిషనర్‌లా కాకుండా టీడీపీ కార్యకర్తలా వ్యవహిస్తూ.. చంద్రబాబు, సుజనా చౌదరితో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల భయాందోళనలను నిమ్మగడ్డ పట్టించుకోవడంలేదు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ మొదలైంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి' అని గుడివాడ అమరనాథ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment