సాక్షి, తాడేపల్లి: సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఎన్నిలకు వెళ్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్తులు ఏకగ్రీవం చేసుకుని నిధులు రాబట్టుకోవాలని సూచించారు. ధన ప్రవాహం, ఇతర సమస్యలు రాకుండా చట్టాన్ని మార్పు చేశామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ అధికారులను ఎస్‌ఈసీ బదిలీ చేశారని.. ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన మండిపడ్డారు. టీడీపీకి నామినేషన్ వేసే వారు కూడా లేరని, చంద్రబాబును హైదరాబాద్ నుంచి వచ్చి నామినేషన్లు వేయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment