
సాక్షి, తిరుమల: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం సబబు కాదని.. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు జరపాల్సిన అసవరం ఏమిటని ప్రశ్నించారు. చదవండి: పెన్నాపై మరో కొత్త బ్రిడ్జి: మంత్రి అనిల్
‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడు ఎన్నికలకు భయపడ లేదు. అది ప్రజలకి తెలుసు. 2018లో చంద్రబాబే ఎన్నికలకు భయపడి పారిపోయారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు ఎటువంటి సహకారం, సాయం అందించలేదని’’ రోజా మండిపడ్డారు సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామని.. ఎన్నికలు జరపాలని న్యాయస్థానం ఆదేశిస్తే.. ధర్మాసనాన్ని గౌరవించి ఎన్నికలు జరుపుతామన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడైనా సిద్ధమేనని.. తమ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షా అని తెలిపారు. చదవండి: నిమ్మగడ్డను బెదిరించాల్సిన అవసరం నాకు లేదు