
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పైకోర్టులకు వెళ్లాలిగానీ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తాం, అనుమతివ్వాలని వెళితే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు. ఇప్పటికైనా నా ఇష్టం, నా పాలన అనే ధోరణి పక్కనపెట్టి వ్యవస్థలను కాపాడాలని, వ్యక్తుల కన్నా వ్యవస్థలే శాశ్వతమని పేర్కొన్నారు.