రంపచోడవరం : తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి బూత్ వద్ద ఒకే ఒక్క పోలీసు కానిస్టేబుల్ తో అధికారులు స్థానిక సంస్థల తుది విడత పోలింగ్ను నిర్వహిస్తున్నారు. దాంతో పోలింగ్ బూత్ వద్ద విచ్చలవిడిగా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు పోలింగ్ బూత్ వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఉన్న ఒక్క కానిస్టేబుల్ ఏమీ చేయలేకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది.
అయితే ఎన్నికల సిబ్బంది దీని గురించి ఏమాత్రం స్పందించలేదు. మరోవైపు కాజులూరు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న టీడీపీ నేత నానాజీని పోలీసులు అరెస్ట్ చేశారు.