పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం నెలకొంది.
కొవ్వూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో పలు పోలింగ్ కేంద్రాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 24 మండలాల్లో 452 ఎంపీటీసీ, 24 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. విద్యుత్ కోతలు ఉంటాయని తెలిసినా...అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయటంలో విఫలం అయ్యారు. ఇక తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో బూత్ లెవల్ అధికారులు ఓటర్ స్లిప్లు ఇవ్వకపోవటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారు
ఒంగోలు : ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరపాడులో అధికారుల నిర్లక్ష్యంతో ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. బ్యాలెట్ పేపర్లో గుర్తులు తారుమారు అయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థికి హస్తం గుర్తు కేటాయింపుతో ఎన్నికలు నిలిచాయి.