గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని.. | Killing her husband with two wives | Sakshi
Sakshi News home page

గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని..

Published Fri, Mar 13 2015 12:17 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని.. - Sakshi

గర్భవతి.. వ్యభిచారానికి పనికిరాదని..

- ఇద్దరు భార్యలతో కలిసి చంపిన భర్త
- నిందితుల అరెస్టు
- కేసు వివరాలు వెల్లడించిన సీఐ వెంకటగిరి

జవహర్‌నగర్: గర్భవతి అయిన భార్య వ్యభిచారానికి పనికిరాదని భావించిన భర్త మరో ఇద్దరు భార్యలతో కలిసి ఆమెను చంపేశాడు. గతనెల జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. సీఐ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన మున్నా అలియాస్ మోహన్(40) తన ముగ్గురు భార్యలతో కలిసి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

కొన్నాళ్ల క్రితం వరంగల్ జిల్లా పస్రా ప్రాంతానికి చెందిన మమత(24)ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆమె కీసర మండలం దమ్మాయిగూడలోని సాయిరాం కాలనీలో ఉంటోంది. గతనెల 12న అదే ప్రాంతంలో నివసించే అన్న కూతురు వివాహానికి మోహన్ తన నలుగురు భార్యలతో కలిసి హాజరయ్యాడు. ఆరునెలల గర్భవతి అయిన మమతను మోహన్ ప్రేమగా చూసుకుంటున్నాడు. తమను పట్టించుకోకపోవడంతో మిగతా ముగ్గురు భార్యలు కక్షగట్టారు.  గర్భవతి కావడంతో వేశ్యవృత్తికి పనికిరాదని, ముగ్గురు భార్యలు భర్త మోహన్‌తో గొడవపడ్డారు.

ఈక్రమంలో అదే రోజు మోహన్ పథకం ప్రకారం  ఇద్దరు భార్యలతో కలిసి మమతకు బాగా మద్యం తాగించారు. అనంతరం ఆమె చీరకొంగుతో మెడకు బిగించి శివ ఇంట్లో ఉరివేసి చంపేశారు. మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి మమత ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులను నమ్మించారు. మృతదేహాన్ని కిందికి దించి మమత ఆత్మహత్యకు పాల్పడిందని పెళ్లికి వచ్చిన బంధువులకు నమ్మబలికి మల్కాజిగిరిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
 
ఇదిలా ఉండగా, వారం రోజుల క్రితం సికింద్రాబాద్‌లో ఓ వేశ్యతో మోహన్ ముగ్గురు భార్యల్లో ఒకరు మమతను హత్య చేసిన విషయం చెప్పింది. సదరు వేశ్య జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సీఐ వెంకటగిరి మోహన్‌తో పాటు ఆయన ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకొని విచారించగా మమతను చంపిన నేరం అంగీకరించారు. వారితో పాటు హత్యకు సహకరించిన మోహన్ అన్నపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement