
మృతదేహాలతో ధర్నా
ప్రొద్దుటూరు టౌన్:
తన భర్తకు చెందిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం మృతదేహాలతో చంద్రశేఖర్‌రెడ్డి రెండో భార్య కవిత ధర్నా చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి మొదటి భార్య రమాదేవి పేరుతో ఉన్న 32 సెంట్ల స్థలం, డబ్బు, బంగారును ఆమె మేనమామ అయిన
శివారెడ్డి ఆధీనంలో ఉంది. భర్త మృతి చెందడంతో జీవనాధారం కోసం తనకు ఆస్తి ఇవ్వాలని కవిత బంధువులు పెద్ద మనుషులతో చెప్పి పంపించగా శివారెడ్డి వినిపించుకోలేదు. దీంతో ఆమె తన బంధువులతో కలసి మృతదేహాలతో వైఎంఆర్‌కాలనీలోని శివారెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ముందు ధర్నా చేసింది. విషయం తెలియడంతో అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి, త్రీ టౌన్ ఎస్‌ఐ మహేష్‌లు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు, పెద్ద మనుషులు శివారెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.