రెండో భార్యను పీక పిసికి చంపిన భర్త | Man strangulates second wife to death | Sakshi
Sakshi News home page

రెండో భార్యను పీక పిసికి చంపిన భర్త

Published Tue, Feb 4 2014 4:04 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

Man strangulates second wife to death

రెండో భార్య అంటే సాధారణంగా ఎవరికైనా మోజు ఉంటుంది. చాలా అపురూపంగా చూసుకుంటారు. కోరినవన్నీ ఇట్టే కొని ఇచ్చేస్తుంటారు. కానీ, మహారాష్ట్రలో మాత్రం ఓ భర్త తన రెండో భార్యను పీక పిసికి చంపేశాడు. థానె జిల్లాలోని భివాండీ టౌన్షిప్ ప్రాంతంలో గల కల్హెర్ గ్రామానికి చెందిన అతుల్ బర్మన్.. తనకు ముందే పెళ్లయిందన్న విషయాన్ని అతడు దాచిపెట్టి ఉంచి, లత (27)ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఆ విషయం తర్వాత లతకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచు గొడవలు అవుతుండేవి. ఇంట్లో తరచు జరుగుతున్న గొడవలతో బాగా విసుగు చెందిన అతుల్ బర్మన్, తన రెండో భార్యను ఆదివారం రాత్రి పీక పిసికి చంపేసి, ఇంట్లోంచి పారిపోయాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement