25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు | 25 marriages .. 146 children | Sakshi
Sakshi News home page

25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు

Jul 30 2017 2:07 AM | Updated on Sep 5 2017 5:10 PM

25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు

25 పెళ్లిళ్లు.. 146 మంది పిల్లలు

కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది.

కెనడాలో ఓ మాజీ మత పెద్ద చేసిన నిర్వాకమిది. గత 25 ఏళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఆయన పాతిక పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడాదికి ఇద్దరు ముగ్గురు సంతానాన్ని పొందాడు. అలా ఆయన సంతానం సంఖ్య 25 ఏళ్లలో 146కు చేరింది. బహుభార్యత్వం కేసులో ప్రస్తుతం ఐదేళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న ఆయన పేరు విన్‌స్టన్‌ బ్లాక్‌మోర్‌. వయసు 61 ఏళ్లు. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్సులోగల బౌంటిఫుల్‌ ప్రాంతంలో ప్రత్యేక వర్గ ప్రజలు నివసిస్తుంటారు. వారిలో ఒకరైన విన్‌స్టన్‌ 1990 నుంచి ఇప్పటివరకు 25 మంది మహిళలను పెళ్లి చేసుకున్నారు. వారితో కాపురం చేసి 146 మంది పిల్లల్ని కన్నారు.

వాస్తవానికి 1990 ల్లోనే విన్‌స్టన్‌ బహుభార్యత్వంపై ఆరోపణలు వచ్చాయి. అయితే, బహుభార్యత్వానికి సంబంధించి చట్టా ల్లో ఉన్న లొసుగులతో విచారణ, శిక్షల నుంచి తప్పిం చుకుంటూ వచ్చా రు. అయితే, 2011లో కెనడాలో బహుభార్యత్వాన్ని ఆ దేశ న్యాయస్థానం నిషేధించింది. ఆ తర్వాత కూడా విన్‌స్టన్‌ వివాహాలు చేసుకుంటూనే ఉన్నారు. దీంతో ఆయన మాజీ భార్య ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన బ్రిటిష్‌ కొలంబియా సుప్రీంకోర్టు జస్టిస్‌ షెరీ ఆన్‌ డొనెగాన్‌.. విన్‌స్టన్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. పాతిక వివాహాలు చేసుకోవడంపై విన్‌స్టన్‌ స్పందిస్తూ.. భగవంతుడి ఆదేశాల మేరకే తాను అన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పడం కొసమెరుపు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement