వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు! | Saudi marriage officials create a WhatsApp group for matchmaking men with multiple wives and 900 women have already signed up | Sakshi
Sakshi News home page

వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!

Published Thu, Jan 12 2017 11:20 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు! - Sakshi

వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!

సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలని ఉద్దేశ్యంతో సౌదీ అధికారులు ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు. పాలిగమీ పేరుతో ఎనిమిది మంది సౌదీ అధికారులు ఈ గ్రూప్ను రూపొందించారు. ఈ గ్రూప్లో ఇప్పటికే 900 మంది మహిళలు రిజిస్ట్రర్ చేసుకున్నారు. పాలీగమీ విశేషమేమిటంటే.. దానిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, పెళ్లికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు.  మక్కా సిటీలో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతుండటాన్ని గమనించిన అధికారులు, వారికో తోడు అందించాలనే ఉద్దేశంతో ఈ ఐడియాతో ముందుకొచ్చారు. 
 
సౌది మహిళలతో పాటు యెమెన్, మోరోకో, సిరియా, పాలస్తీనా, ఈజిస్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్లోని మహిళలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్లో పేర్లు నమోదుచేసుకున్న మహిళలు రెండో, మూడో, నాలుగో భార్యగైనా వెళ్లడానికి వారికి తాము సిద్దమని పేర్కొన్నట్టు తెలిసింది.  నమోదు జాబితా ప్రకారం దీనిలో అతిపెద్ద వయసున్న అమ్మాయికి 55 సంవత్సరాలు కాగ, తక్కువ వయసున్న అమ్మాయికి 18 సంవత్సరాలు. ఎత్తు ప్రకారం చూసుకుంటే, 4'7" నుంచి 5'10" ఎత్తు ఉన్న మహిళలున్నారు. కొంతమంది మహిళలు తమకు కావాల్సిన అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి వాటిని అంగీకరించాలో కూడా ఆ గ్రూప్లో పేర్కొన్నారు.  ఉచిత సర్వీసు ఫీజుతో వారికి పెళ్లి కుదుర్చుతామని మ్యారేజ్ అధికారులు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement