సర్దార్ టార్గెట్ 'సెంచరీ'! | Pakistani Father Sardar Jan Mohammad Khilji Of 35 Now Aims For 100 Children | Sakshi
Sakshi News home page

సర్దార్ టార్గెట్ 'సెంచరీ'!

Published Fri, Jun 3 2016 12:59 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

సర్దార్ టార్గెట్ 'సెంచరీ'! - Sakshi

సర్దార్ టార్గెట్ 'సెంచరీ'!

క్వెట్టా: తన టార్గెట్ సెంచరీ అంటున్నాడు పాకిస్థాన్ కు చెందిన సర్దార్ జాన్ మహ్మద్ ఖిల్జీ. అతడు క్రికెటర్ కాదు కామన్మేన్. అయితే సెంచరీ అని చెప్పింది క్రికెట్ పరుగుల గురించి కాదు. 'సంతానం'లో సెంచరీ కొడతానంటున్నాడు. 100 మంది పిల్లల్ని కనడమే అతడి లక్ష్యమట. అత్యధిక సంతానం పొందడం మతపరమైన పవిత్రకార్యంగా భావించే 46 ఏళ్ల సర్దార్ ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకునేందుకు అన్వేషణ ప్రారంభించాడు. ఇప్పటికే అతడికి 35 మంది పిల్లలు ఉన్నారు.

గంపెడు సంతానంతో సంతోషంగా గడుపుతున్నానని మెడికల్ టెక్నిషియన్ గా పనిచేస్తున్న సర్దార్ చెబుతున్నాడు. అంతమంది పిల్లలు ఉన్నా వాళ్ల పేర్లు ఎప్పుడోగాని మర్చిపోడట. అధిక సంతానంతో ఫ్యామిలీ ఫంక్లన్లను వెళ్లలేకపోతున్నానని తెలిపాడు. ముగ్గురు భార్యలు, 35 మంది పిల్లలు అంతా కలిసి మెలిసి ఉంటారని వెల్లడించాడు.

అయితే సర్దార్ నాలుగో పెళ్లి ప్రయత్నాలను అతడి ముగ్గురు భార్యలు సమర్థించడం విశేషం. తన భార్యలతో మాట్లాడేందుకు 'ఏఎప్ఫీ' విలేకరిని అనుమతించలేదు. బహుభర్యాత్వం మంచిది కాదని సామాజిక కార్యకర్తలు, బుద్ధిజీవులు వారిస్తున్నా సర్దార్ అవేం పట్టించుకోకుండా 'సెంచరీ' దిశగా ముందుకు సాగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement