Pakistan Man 3 Wives Welcomes 60th Child, Seeks Marry Again News Goes Viral - Sakshi
Sakshi News home page

60వ సారి తండ్రయిన పాకిస్తానీ.. నాలుగో పెళ్లికి రెడీ! అతని ముగ్గురు భార్యలు ఏమన్నారంటే?

Jan 4 2023 5:46 PM | Updated on Jan 5 2023 3:49 PM

Pakistan Man 3 Wives Welcomes 60th Child Seeks Marry Again Viral News - Sakshi

తనకు మగ సంతానం కంటే ఆడ సంతానం అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు. నాలుగో పెళ్లి కోసం స్నేహితుల సాయం కూడా కోరినట్టు వెల్లడించాడు.

ఉరుకులు పరుగుల జీవితం. చాలీచాలని జీతం. సొంత పనులతో సతమతం. వెరసి ఒక్క బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు అనే పరిస్థితి. ఆర్థికంగా స్థితిమంతులైతే మరో ఇద్దరైనా పర్లేదనుకోవడం వింతేం కాదు! కానీ, పాకిస్తాన్‌కు చెందిన ఈ వ్యక్తి మాత్రం తాజాగా 60వ సారి తండ్రయ్యాడు. వైరల్‌గా మారిన ఈ సంగతి తెలిసినోళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...

బలూచిస్తాన్‌ రాజధాని ఖ్వెట్టా ప్రాంతానికి చెందిన సర్దార్‌ జన్‌ మొహమ్మద్‌ ఖాన్‌ ఖిల్జీ తన 50 వ ఏట మరో వారసునికి తండ్రయ్యాడు. అంతేకాదు ఇప్పటికే ముగ్గురు భార్యలున్న ఈయన మరో భార్య కావాలంటూ ప్రయత్నాలు చేయడం విశేషం. ఫ్యామిలీ డాక్టర్‌ అయిన సర్దార్‌ జన్‌.. తన సొంతింట్లోనే క్లినిక్‌ నడుపుతున్నాడు. తాజాగా పుట్టిన తన బిడ్డకు హాజీ ఖుషాల్‌ ఖాన్‌ అనే పేరు పెట్టాడు. అంతేకాదు అంత పెద్ద కుటుంబాన్ని ఒకే చోట పెట్టి పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని షంషద్‌ న్యూస్‌ అనే వార్తా సంస్థ ట్విటర్‌లో పేర్కొనగా వైరల్‌గా మారింది.
(చదవండి: 6 నెలల తర్వాత తొలిసారి.. ఉక్రెయిన్‌ సైనికుడిని చూసి భార్య భావోద్వేగం.. వైరలవుతోన్న వీడియో)

ఇక మరోసారి తండ్రయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్దార్‌ జన్‌.. తనకు మగ సంతానం కంటే ఆడ సంతానం అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చాడు. మరో పెళ్లి చేసుకుని మరింత మంది వారసులకు జీవితాన్నిస్తానని అంటున్నాడు. నాలుగో పెళ్లి కోసం స్నేహితుల సాయం కూడా కోరినట్టు వెల్లడించాడు. తన కుటుంబం మరింత పెద్దదైనా వేరు చేయకుండా ఒకేచోట ఉండాలని అతను ఆకాంక్షించాడు. ఇదిలాఉంటే.. ఇప్పటికే పదుల సంఖ్యలో బిడ్డలకు జన్మనిచ్చిన అతని ముగ్గురు భార్యలు మరిన్ని కాన్పులకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం మరో విశేషం.
(చదవండి: తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement