ఒకేసారి ఇద్దరితో పెళ్లి | Ronaldinho Will Marry Two Women at the Same Time | Sakshi
Sakshi News home page

Published Fri, May 25 2018 9:20 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Ronaldinho Will Marry Two Women at the Same Time - Sakshi

రోనాల్డిన్హో.. పక్కన ప్రియురాళ్లతో...

రియో డీ జనీరో: ఫుట్‌ బాల్‌ స్టార్‌ రోనాల్డిన్హో (38) ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రిసిల్లా కోఎల్హో, బియాట్రిజ్‌ సౌజా అనే ఇద్దరు యువతులతో  రొనాల్డిన్హో డేటింగ్‌లో ఉన్నాడు. ప్రిసిల్లాతో కొన్నేళ్లుగా ప్రేమలో(2012 నుంచి) ఉన్న ఈ స్టార్‌ ప్లేయర్‌‌, బియాట్రిజ్‌తో మాత్రం 2016 నుంచి అఫైర్‌ కొనసాగిస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌ నుంచి వీరు ముగ్గురు ఒకే నివాసంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆగష్టులో ఈ ఫుట్‌బాల్‌ వీరుడు ఒకేసారి వారిద్దరిని వివాహం చేసుకోబోతున్నాడు. అయితే రోనాల్డిన్హో పద్ధతులు నచ్చని అతని సోదరి, తాను మాత్రం ఆ వివాహానికి హాజరుకాబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ డియా అనే పత్రిక ప్రచురించింది. 

1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్‌ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్‌ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్‌ కప్‌ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్‌ ఫుట్‌ సాల్‌ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్‌ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్‌మెంట్‌ ప్రకటన చేయించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement